తాటి క‌ల్లు, ఈత క‌ల్లు కాదు… వేప క‌ల్లు కూడా రెడీగా ఉంది..! ఎక్క‌డో తెలుసా..?

క‌ల్లు… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. చాలా మందికి క‌ల్లు గురించి తెలుసు. పల్లెటూర్ల‌లోనైతే ఇది కొంచెం స్వ‌చ్ఛంగానే దొరుకుతుందని చెప్ప‌వ‌చ్చు. అలాంటి క‌ల్లును తాగితే మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే క‌ల్లులో రెండు ర‌కాలు ఉన్నాయి. అవేనండీ.. తాటి క‌ల్లు, ఈత క‌ల్లు. రెండూ రుచులు వేర్వేరు అయినా అవి ఇచ్చే మ‌జా దాదాపుగా ఒకేలా ఉంటుంది. అయితే ఇవే కాదండోయ్‌..! మ‌రో చెట్టు క‌ల్లు కూడా ఇప్పుడు పాపుల‌ర్ అవుతోంది. అదేం చెట్టు..? ఏం క‌ల్లు..? తెలుసుకోవాల‌ని ఉందా..? ఇంకెందుకాల‌స్యం… చూద్దాం రండి..!

అది ఢిల్లీ యూనివ‌ర్సిటీలోని నార్త్ క్యాంప‌స్‌. అక్క‌డ ర‌గ్బీ స్టేడియం ఉంది. దానికి ఆనుకుని ఓ వేప చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచే క‌ల్లు వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఏంటీ… వేప చెట్టు నుంచి క‌ల్లు రావ‌డ‌మా..? అని ఆశ్చ‌ర్య‌పోకండి. మేం చెబుతోంది నిజ‌మే. అక్క‌డ గ‌తేడాది కాలంగా వేప చెట్టుకు క‌ల్లును పోలిన ద్ర‌వం వ‌స్తుంద‌ట‌. మొద‌ట్లో దాని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ కొంద‌రు దాన్ని టేస్ట్ చేశారు. ఇంకేముందీ… ఆ రుచి కాస్తా క‌ల్లును పోలి ఉంది. ద్ర‌వం కూడా క‌ల్లులాగే ఉండ‌డంతో దానికి వేప క‌ల్లు అని పేరు పెట్టేశారు. అంతే… ఇక అప్ప‌టి నుంచి ఆ చెట్టుకు వ‌స్తున్న క‌ల్లును తాగి ఆ క్యాంప‌స్ విద్యార్థులు సేదదీరుతున్నార‌ట‌. అంతేకాదు, అప్పుడ‌ప్పుడు కొంద‌రు బ‌య‌టి వ్య‌క్తులు కూడా ఆ క‌ల్లును తాగుతున్నార‌ట‌.

ఢిల్లీ యూనివ‌ర్సిటీలో మొత్తం 15 వేప చెట్లు ఉన్నాయ‌ట‌. అయినా కేవ‌లం ఆ స్టేడియం వ‌ద్ద ఉన్న ఆ ఒక్క చెట్టు నుంచే క‌ల్లు ఉత్ప‌త్తి అవుతోంద‌ట‌. రోజుకు ఆ చెట్టు 10 లీట‌ర్ల క‌ల్లును ఇస్తుంద‌ట‌. దీంతో దాన్ని ప‌ట్టుకునేందుకు విద్యార్థులు పోటీ ప‌డుతున్నారు. దానికి ఏకంగా బ‌కెట్లు పెట్టి మ‌రీ క‌ల్లును సేక‌రిస్తున్నారు. అనంత‌రం దాన్ని తాగుతూ మ‌జా చేస్తున్నారు. ఇప్పుడీ వార్త నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే… ఈ వార్త తెలిశాక మీకూ ఆ క‌ల్లు తాగాల‌ని ఉందా..? ఇంకెందుకాల‌స్యం. తెలిసిన వారు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే ఢిల్లీ యూనివ‌ర్సిటీకి వెళ్లి రండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top