నీళ్లలో పడి బాగా తడిసిపోయిన ఫోన్ ను ఇలా చేసి పాడవ్వకుండా చేయొచ్చు.!

అసలే వర్షాకాలం, దానికి తోడు ఎప్పుడు వర్షం పడుతుందో అనే క్లారిటీ అసలే ఉండదు. ఏదో పనిమీద బయటికి వెళ్లిన మనం ఇంటికి వెళ్లే సరికి ముద్దముద్దగా నానిపోయి ఉంటాము. వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుంటే అది నరకమే… అలాంటి సమయంలో మన జేబుల్లో ఉన్న వస్తువులు తడిసిపోతుంటాయి. అన్నింటికి మించి మన ఫోన్.! ఏదిపోయినా ఏం కాదు కానీ..ఫోన్ పోతే అన్నీ పోయినట్టే అనే స్థితికి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో….వర్షంలో తడిచిన ఫోన్ ను, నీటిలో పడిపోయిన ఫోన్ ను  ఏం చేస్తే పాడవకుండా ఉంటుందో అని తెల్సుకుందాం.

ూ్ేయా

  • నీళ్లలో పడ్డ పోన్ ను వీలైనంత త్వరగా తీయాలి.
  • మొదటగా ఫోన్ నుండి బ్యాటరీ తీసి, టవల్ తో కానీ, టిష్యూ పేపర్స్ తో కానీ తుడవాలి.
  • సిమ్ కార్డ్, మెమొరీ కార్డ్ , ప్రొటెక్టింగ్ కవర్,  ప్యానల్..ఇలా అన్ని పరికరాలను వేరుచేయాలి.
  • వ్యాక్యూమ్ క్లీనర్ సహాయంతో లోపలి బాగాల నుండి నీటిని, తడిని తొలగించాలి, చాలా మంది హెయిర్ డ్రయర్ తో ఫోన్ ను వేడిగా  చేయడానికి ట్రై చేస్తారు. ఇది తప్పు…వ్యాక్యూమ్ క్లీనర్ తడిని లాగేస్తుంది, హెయిర్ డ్రయర్ ఆవిరిని బయటికి  పంపుతుంది సో… ఈ పరిస్థితుల్లో వ్యాక్యూమ్ క్లీనర్ వాడాలి, హెయిర్ డ్రయ్యర్ కాదు.
  • ఓ 30 నిమషాలు వ్యాక్యూమ్ క్లీనర్ తో తడి అంతా ఆరేలా చేశాక….ఓ 20 నిమిషాలు బియ్యం  సంచిలో ఉంచాలి.
  • తర్వాత బయటకు తీసి సెల్ ఫోన్  అంతా క్లీన్ చేసి, ఎండలో కాసేపు ఉంచాలి.
  • ఇప్పుడన్నీ సెట్ చేసి…… ఆన్ చేయాలి.
  • నీటిలో తడిచిన ఫోన్ లు, ఇలా చేశాక 80 శాతానికిపైగా తిరిగి ఆన్ అవుతాయి, 20 శాతం ఫోన్లు ఆన్ అవ్వవు.
  •  ఆన్ అయితే ఓకే, ఆన్ కానీ ఫోన్ లను…..సర్విసింగ్ సెంటర్లో రిపేరింగ్ కు ఇవ్వాల్సిందే.

 

Comments

comments

Share this post

scroll to top