మిస్‌ వరల్డ్‌పై వెకిలి కామెంట్లు చేసిన పాకిస్థాన్‌. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన మానుషి చిల్లర్‌.

దొంగ‌బుద్ధి పాకిస్థాన్‌… మ‌న దేశం అంటే ఎప్పుడూ దానికి అసూయే. మ‌నం ఏదైనా రంగంలో ప్ర‌గ‌తి సాధిస్తే అది చూసి ఓర్వ‌లేదు. వెన‌క‌టికి ఎవరో సామెత చెప్పిన‌ట్టు.. మ‌న దేశం ఏ అంశంలో ప్ర‌ముఖంగా నిలిచినా దాని వ‌క్ర‌బుద్ధిని పాకిస్థాన్ చూపిస్తుంది. అంతేకానీ వారు పాజిటివ్‌గా తీసుకోరు. ఏమైనా మ‌న దేశాన్ని, మన ప్ర‌జ‌ల‌ను విమ‌ర్శించ‌డ‌మే వారి ప‌ని. అందులో భాగంగానే వారు తాజాగా మ‌రోసారి త‌మ ఈర్ష్య‌, అసూయ‌ల‌ను తామే బ‌య‌ట పెట్టుకున్నారు. అనంత‌రం మ‌న వైపు నుంచి స్ట్రాంగ్ కౌంట‌ర్ ప‌డ‌డంతో కింద‌, మీద అన్నీ మూసుకున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

మానుషి చిల్ల‌ర్ ఉంది క‌దా. మొన్నా మ‌ధ్యే మిస్ వ‌ర‌ల్డ్ 2017 టైటిల్‌ను గెలిచింది. 17 ఏళ్ల తరువాత భారత్‌ కు 6వ సారి ఆ కిరీటాన్ని సాధించి పెట్టింది. మొత్తం 118 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడితే మానుషి చిల్లర్‌ కష్టపడి ఆ కిరీటాన్ని సాధించింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అయితే భారత్‌కు ఈ ఘనత దక్కడాన్ని పాకిస్థాన్‌ జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆ దేశ మీడియాతోపాటు ప్రజలు కూడా భారత్‌ సాధించిన ఈ విజయం పట్ల వెకిలి కామెంట్లు చేశారు. అసలు భారత్‌లో అందగత్తెలు ఉండరని, పాకిస్థాన్‌లోనే చాలా అందం ఉన్న అమ్మాయిలు ఉంటారని, వారే నిజమైన విన్నర్లని, వారికే మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ వస్తుందని కామెంట్లు చేశారు.

దీంతో భారత నెటిజన్లు ఘాటుగానే స్పందించారు. పాకిస్థాన్‌ వెకిలి కామెంట్లకు కౌంటర్‌గా అనేక పోస్టులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే ఈ విషయంపై మన మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ కూడా స్పందించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ… మిస్‌ వరల్డ్‌ పోటీ అంటే మామూలు విషయం కాదని, 118 దేశాలకు చెందిన వారు పోటీ పడితే వారందరిలోకెల్లా తాను మిస్‌ వరల్డ్‌గా గెలిచానని మానుషి చెప్పింది. అంతేకాదు, అసలు పోటీలో పాల్గొన్నవారు అందరూ అందగత్తెలే అని, కానీ మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ ను అందానికి ఇవ్వరని, మనస్సులో ఉన్న అందానికి ఇస్తారని, ఆ అందంతో సమాజాన్ని ఎలా బాగు చేస్తారు ? అనే విషయంపై ఇచ్చే సమాధానాన్ని బట్టి జడ్జిలు మిస్‌ వరల్డ్‌ విన్నర్‌ను ఎంపిక చేస్తారని మానుషి చెప్పింది. అవును మరి… పైకి కనిపించే అందం అందం కాదు కదా, మనస్సు నిర్మలంగా ఉండాలి, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. అదే నిజమైన అందం అంటే..! అది కూడా పాకిస్థాన్‌ మూర్ఖులకు తెలియదు. కామెంట్లు చేస్తారు. చివరకు ఇలా భంగపడతారు. అంతేలే.. వారికది అలవాటే కదా..!

watch video here:

Comments

comments

Share this post

scroll to top