కడుపులో పాప, ఒంటిపై కిరోసిన్…చేతిలో అగ్గిపెట్టె…..55 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఆమె.

కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ బాబు దగ్గరికి వెళ్లి అమ్మలా అతనిలో ధైర్యాన్ని నింపుతుంది. యాసిడ్ దాడిలో ముఖమంతా కాలి బాధపడుతున్న వారి  దగ్గరికి వెళ్లి ఓ అక్కలా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది . మంటల్లో చిక్కుకొని కాలిన దేహాలతో…..విలవిల్లాడుతున్న వారిని ప్రేమగా దగ్గరికి తీసుకొని..ఏం కాదు, తగ్గిపోతుందిలే అంటూ ఆప్యాయత తో బర్నల్ రాస్తుంది.  కాలిన బాధను తట్టుకోలేక , యాాసిడ్ దాడులతో  ముఖ ఆకారాన్ని కోల్పోయాక, సమాజమంతా వారిని చులకన చేసి చూడడాన్ని తట్టుకోలేక…ఆత్మహత్యే శరణ్యమనుకున్న వారిలో తన ఉపన్యాసాల ద్వారా చైతన్యాన్ని కల్గిస్తుంది. మన సత్తా తక్కువేమీ కాదు..సాధించే సత్తువ మనలో కూడా ఉంది. అంటూ వారిలో సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. జీవితాన్ని గెలిచే బాటను వారికి పరిచయం చేస్తుంది.

ఆమె పేరే నిహారి మండలీ….BSMS అనే ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి….అగ్నిప్రమాదాాల వల్ల, యాసిడ్ దాడి  వల్ల గాయపడిన బాధితులకు చికిత్సను…వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ…ఇప్పటికే పలు అవార్డులను అందుకుంది. దేశ విదేశాల్లో పర్యటిస్తూ….అగ్రిప్రమాద బాధితులలో స్పూర్తిని నింపుతుంది. ఆమె మాటలు మంత్రదండంలా పనిచేస్తాయి. ఆమె ప్రతీ పదం వారికి వారినే కొత్తగా పరిచయం చేస్తుంది….ఎందుకంటే నిహారి వీరి బాధలన్నీ ప్రత్యక్షంగా చూసి వచ్చిందే.. 55 శాతం కాలిన గాయాలతో  హాస్పిటల్ లో చావుతో పోరాడి గెలిచిన గతం తనది….ఆ బాధ ఎలాందో ప్రత్యక్షంగా అనుభవించిదే కాబట్టే   అగ్ని ప్రమాద బాధితుల సమస్యలెలా ఉంటాయి. వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, వారికి ఎటువంటి వైద్యం అవసరం, బంధువుల నుండి సమాజం నుండి వారు ఏం కోరుకుంటారు..ఇలా అన్నింటిని విడమరిచి చెబుతూ బాధితులకు తనవంతు సహాయం చేస్తూనే ప్రభుత్వాలు ఎటువంటి సహాయం చేస్తే వారి బతుకులు మారుతాయో తెలుపుతూ ఓ NGO ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది.

Mandali-Neehaari-1024x596

శరీరమంతా కాగితంలా కాలిపోతున్నా చావుతో పోరాడి గెలిచి..ఇప్పుడు తనలాంటి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన  నిహారి గురించి కాస్తంత వివరంగా తెలుసుకుందాం.

నిహారీ కూడా అందరిలాంటి అమ్మాయి… తనకంటూ లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి.ఇంతలోనే మంచి సంబంధం అంటూ పెళ్ళికి ఒప్పించారు పేరెంట్స్…సరే అంటూ తలొంచి తాళి కట్టించుకుంది. తాను కట్టుకుంది రాక్షసుడినని త్వరలోనే తెలిసింది నిహారికి….చెడు అలవాట్లు, భార్యను కూడా వేశ్యగా చూస్తూ సుఖపెట్టినందుకు ఇంత…అని డబ్బులు చెల్లించే అతని మనస్తత్వం, ఇందేటి అని ప్రశ్నిస్తే….అంతేలా అన్నట్టు…ఓ వికృత చూపు చూసేవాడు.  చిత్రహింసలతో  ప్రతి రోజూ నరకాన్ని చూపించేవాడు. ఇలాంటి భర్తతో జీవితాన్ని పంచుకోవడం వ్యర్థమని తలచిన నిహారి ఆత్మహత్యే శరణ్యం అనుకుంది.

అప్పటికే ఆమె 3 నెలల గర్భావతి…. కడుపులో పాప, ఒండినిండా కిరోసిన్ పోసుకుని ఉంది, చేతిలో అగ్గిపెట్టె….అంటించుకుందాం అనేలోపు ఓ ఆలోచన….కడుపులో పాప పరిస్థితి ఏంటి? అని ఆమెలో ప్రశ్న? పుట్టేది అమ్మాయి అయితే ఆమె కూడా ఇలాంటి నరకంలో పెరగాల్సిందే కదా….అలాంటప్పుడు పుట్టించడం ఎందుకు , నరకాన్ని చూపించడం ఎందుకు అని ఆమెకు ఆమే సమాధానం చెప్పుకుంది. నిప్పు  అంటించుకుంది. ఒక్కసారిగా మంటలు….వేడినీళ్లు మీద పడితేనే తట్టుకోలేని ఆ దేహం…కాగితంలా కాలిపోతుంది…? ఆ మంటల్లో శరీరమంతా మాడిపోతుంది…అరవడానికి కూడా నోరు సహకరించట్లేదు.?  కళ్లు మూతలు పడిపోయాయి..

bp-20141017-115-jpg

మూడు రోజులు కోమాలో ఉన్న తర్వాత కళ్లు తెరుచుకుంది నిహారి….అప్పటికే కాలిన గాయాలతో శరీరమంతా మండిపోతుంది…దేహమంతా పచ్చి పుండైంది. బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. కానీ ఆమె బ్రతికింది. విది మీద పోరాటం చేయడానికి, తనలాంటి అభాగ్యులను ఆదుకోడానికి, కారణమేదైనా ఆత్మహత్యలు వద్దంటూ తన జీవితాన్ని ఉదాహరణగా  చెబుతూ…అందర్నీ మోటీవేట్ చేయడానికి….. ఆ క్షణం మొదలు ఇప్పటి వరకు నిహారి వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని అగ్నిప్రమాదాల్లో గాయపడిని వారి బాగుకొరకే.. హ్యాట్సాఫ్ నిహారి.

ఆమెను కలవాలనుకుంటున్నారా? ఆమె చేసే మంచిపనికి మీరు సైతం అండగా ఉండాలనకుంటున్నారా?  అయితే ఆమె నెంబర్ కు ఫోన్ చేయండి. ఓ మానవతా మూర్తి అడుగులో అడుగు వేద్దాం.ఎందరో అభాగ్యులకు అండగా నిలబడదాం.

Neehaari Mandali  Face Book Id: CLick Here.

Neehaari Mandali Phone Number: +917680974918

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top