సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ “సినిమా టీజ‌ర్.! సినిమా విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు.!!

స్టార్ హీరో న‌టించిన సినిమా కాదు, పేరు మోసిన డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన చిత్రం కాదు., అయినా ఫేస్ బుక్ నిండా అభినంద‌న‌ల వెల్లువ‌… ఎవ‌రి ప్రొఫైల్ పిక్ చూసినా ఈ సినిమా పోస్ట‌రే.! ఇక యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒక‌టిగా నెటీజ‌న్ల చేత నీరాజనాలు అందుకుంటుంది.. ఈ సినిమా టీజ‌ర్.! టీజ‌ర్ తోనే సోష‌ల్ మీడియాలో ఇంత బ‌జ్ క్రియేట్ చేసిన ఆ సినిమానే #నీదీ నాదీ ఒకే క‌థ‌. విష్ణు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్.!

ఇప్ప‌టి వ‌ర‌కు రైట‌ర్ గా త‌న స‌త్తా నిరూపించుకున్న వేణు ఉడుగుల తొలిసారి తీసిన చిత్రం…#నీదీ నాదీ ఒకే క‌థ‌… సినిమా టైటిల్ తో మొద‌లు మోష‌న్ పోస్ట‌ర్-టీజ‌ర్….ఇలా ప్ర‌తిదానిలో ద‌ర్శ‌కుడు చూపించిన వైవిధ్యం ప్ర‌తి ఫ్రేమ్ లో స్ఫ‌ష్టంగా క‌నిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా టీజ‌ర్ ను ఓ మెకానిక్ తో రిలీజ్ చేసి చేయించి స‌రికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు చిత్ర యూనిట్. సినిమా అంటే… స్టార్ హీరో, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ , పాట‌ల‌కు ఫారిన్ లొకేష‌న్స్, గాల్లో ఫైట్స్, ఐట‌మ్ సాంగ్స్ అని ఫిక్స్ అయిపోయిన మ‌నకు… స‌జీవ‌మైన‌, స‌హ‌జ‌మైన సినిమాను అందించేందుకు ఎంతగానో క‌ష్ట‌ప‌డ్డారు ఈ చిత్ర‌యూనిట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బ‌మ్సే.!! #ఆల్ ది బెస్ట్ నీదీ నాదీ ఒకే క‌థ టీమ్.

Watch Teaser:

 

Comments

comments

Share this post

scroll to top