“నీది నాది ఒకే కథ” యూత్ కి కనెక్ట్ అయ్యిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Krishna

Movie Title (చిత్రం): నీదీ నాదీ ఒకే కథ (Needhi Naadhi Oke Katha)

Cast & Crew:

నటీనటులు: శ్రీవిష్ణు,సట్నా టిటూస్,నారా రోహిత్,పోసాని కృష్ణమురళి తదితరులు
దర్శకత్వం: వేణు ఊడుగుల
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత: ప్రశాంతి, విజయ్

ఎడిటింగ్: జీ నాగేశ్వరర్ రెడ్డి
కెమెరా: తోట రాజు
బ్యానర్: అరన్

Story:

సాగర్(శ్రీవిష్ణు) ఎలాంటి బాధ్యత లేని యువకుడు. చదువంటే అస్సలు పడదు. చదువంటే భారంగా భావించే సాగర్ చిన్నప్పటి నుంచి తండ్రి (దేవీ ప్రసాద్) అంచనాలకు దూరంగా ఉంటాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతూ తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. స్నేహితులు, క్రికెట్ అంటూ తిరిగే సాగర్ తన తండ్రి కోసం మారాలనుకుంటాడు. అదే సమయంలో తన ఎదురింట్లో ధార్మిక(సాత్నా టైటస్) అద్దెకు దిగుతుంది. ఆమెకు క్రమశిక్షణ, విధేయత చాలా ఎక్కువ. సాగర్ ఆమె సహాయం తీసుకొని మారే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ క్రమంలో తనను తాను కోల్పోతుంటాడు. ఈ విషయాన్ని గమనించిన సాగర్.. ఇక చదలేనని, తనకు వచ్చిన పని చేసుకొని బతుకుతానని తండ్రికి చెబుతాడు. ఒక ప్రొఫెసర్ అయిన తండ్రి.. సాగర్ నిర్ణయాన్ని స్వాగతించాడా? మరి సాగర్ జీవితంలో సెటిల్ అయ్యాడా..? చదువును పక్కనపెట్టిన సాగర్ తన తండ్రి మనసును గెలుచుకున్నాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

Review:

పిల్లలు బాగా స్థిరపడితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. దాని కోసం వారు ఎంతో కష్టపడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని భావిస్తారు. తమ పిల్లల్ని ఏ ఇంజనీరో.. డాక్టరో.. చేసేయాలని వారిని చిన్నప్పటి నుంచి తెగ కష్టపెట్టేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమ పిల్లలకు అవసరమయ్యే ఇతర అంశాలను వారు పక్కన పెట్టేస్తారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదని చెప్పే సినిమానే ‘నీది నాదీ ఒకే కథ’. ఈ సినిమాలో హీరో తన కోసం తాను బతకాలనుకుంటాడు. చదువు రాకపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదు.. తనకు వచ్చిన పని చేసుకొని కూడా బతకొచ్చు అని గ్రహిస్తాడు.

కానీ పరువు ప్రతిష్టలకు పెద్ద పీట వేసే తన తండ్రి.. కొడుకు కంటే పరువే ముఖ్యమని అనుకుంటాడు. తండ్రి, కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాల కలయికే ఈ సినిమా. దర్శకుడు రాసుకున్న కథ, కథనం ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంటుంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారు కాస్త అసహనానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కానీ యువతకు మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే హీరో పాత్రలో ప్రతి కుర్రాడు తనను తాను ఊహించుకుంటాడు.

ఇక హీరో శ్రీవిష్ణు నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి. దేవీ ప్రసాద్, శ్రీవిష్ణు మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అయితే తొలి భాగంలో ఉన్నంత వినోదం సెకండ్ హాఫ్‌లో లోపించింది. రెండో భాగాన్ని కాస్త సాగదీసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సాత్నా టైటస్ తన పాత్రలో ఇమిడిపోయింది. తెరపై అందంగా కనిపించింది. హీరో ఫ్యామిలీకు సంబంధించిన సన్నివేశాలు, శ్రీవిష్ణు చిత్తూరు యాసలో చెప్పే డైలాగ్స్ కొంతవరకు నవ్విస్తాయి. ఇక దర్శకుడు వేణు ఊడుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అన్నీ ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తాయి. తొలి సినిమానే అయినా చాలా పరిణతితో తెరకెక్కించారు.

సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. తోటరాజు సినిమాటోగ్రఫీ చూడచక్కగా ఉంది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న తోట రాజు మరోసారి కెమెరాతో తన ప్రతిభను రుజువు చేసుకున్నారు. ఎడిటింగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

Plus Points:

శ్రీవిష్ణు
స్టోరీ
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
సంగీతం
ఎమోషనల్ సన్నివేశాలు
కామెడీ
హీరోయిన్

Minus Points:

కొద్దిగా సాగదీసినట్టు అనిపించే సెకండ్ హాఫ్
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో మాస్ ఆడియన్స్ కి అంతగా నచ్చదు

Final Verdict:

థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రతి యువకుడు..ఇది నా కథ అని ఫీల్ అయ్యేంతగా కనెక్ట్ అవుతారు.!

AP2TG Rating:  3.5 / 5

Trailer:

Comments

comments