కాబోయే భర్త ను పరిచయం చేసిన నయనతార.! ఇంతకీ అతను ఎవరో తెలుసా.?

నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’సినిమా సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ సందడి చేస్తూ వస్తున్నారు. వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా శుక్రవారం(మార్చి-23) ‘ది హిందూ’ ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్న తర్వాత తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారన్న వార్త కన్ఫర్మ్‌ అయ్యింది.

Comments

comments

Share this post

scroll to top