కాలి ప‌గుళ్ల‌ను పోగొట్టే స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల గురించి తెలుసుకోండి..!

మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల‌న్నీ నిర్దిష్ట ప‌రిమాణాన్ని, ఆకారాన్ని క‌లిగి ఉంటాయి. ఏ ఒక్క‌దానితో మిగ‌తా దానికి పొంత‌న ఉండ‌దు. ఇక చ‌ర్మం విష‌యానికి వ‌చ్చినా అంతే. ప్ర‌ధానంగా మ‌న ఒంటిపై ఉన్న చ‌ర్మానికి, అరికాళ్ల‌ల్లో ఉన్న చ‌ర్మానికి చాలా తేడా ఉంది. ఈ క్ర‌మంలో ఒంటిపై ఉన్న చ‌ర్మం విడుద‌ల చేసిన‌ట్టుగా అరికాళ్ల‌లో ఉండే చ‌ర్మం స‌హ‌జ సిద్ధ‌మైన ఆయిల్స్‌ను విడుద‌ల చేయ‌దు. దీని కార‌ణంగా అరికాళ్లు ప‌గులుతూ ఉంటాయి. అయితే ఒక్కో సంద‌ర్భంలో వేరే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా అరికాళ్లు ప‌గ‌ల‌వ‌చ్చు. కానీ సాధార‌ణ ప‌గుళ్ల‌కైతే కొన్ని సింపుల్ చిట్కాల‌ను వాడితే స‌రిపోతుంది. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

cracked-feet

1. చిన్న ట‌బ్‌లో కొంత గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని అందులో కొద్దిగా లిక్విడ్ సోప్‌ను క‌ల‌పాలి. అనంత‌రం నీటిని బాగా క‌లియ‌బెట్టాలి. ఆ నీటిలో పాదాల‌ను 20 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం ప్యూమిక్ స్టోన్ స‌హాయంతో అరికాళ్ల‌పై మ‌ర్ద‌నా చేసిన‌ట్టు రాయాలి. ఇలా చేశాక కాళ్ల‌ను నీటితో శుభ్రంగా క‌డిగి ఆర‌నివ్వాలి. అనంత‌రం ఏదైనా క్రీం లేదా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే పాదాలు సుంద‌రంగా మార‌డమే కాదు, కాలి ప‌గుళ్లు కూడా పోతాయి.

2. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పాదాల‌ను గోరు వెచ్చ‌ని నీటిలో కొంత సేపు ఉంచి అనంత‌రం శుభ్రంగా క‌డ‌గాలి. త‌డి ఆరిపోయాక కొద్దిగా కొబ్బ‌రినూనెను పాదాల‌పై రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కాలి ప‌గుళ్లు త‌గ్గిపోతాయి.

3. గ్లిజ‌రిన్, నిమ్మ‌ర‌సంల‌ను స‌మ‌భాగాల్లో తీసుకోవాలి. కావాల‌నుకుంటే కొద్దిగా రోజ్ వాట‌ర్‌ను కూడా క‌ల‌ప‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌పై రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల 2 వారాల్లో ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి.

feet in tub

4. కాలి పగుళ్ల‌ను త‌గ్గించే గుణం ఎప్సం సాల్ట్‌కు ఉంది. కొద్దిగా ఎప్సం సాల్ట్‌ను గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఆ నీటిలో పాదాల‌ను కొంత సేపు ఉంచాలి. అనంత‌రం పాదాల‌ను బ‌య‌టికి తీసి ప్యూమిక్‌స్టోన్‌తో వాటిపై రాయాలి. పాదాలు త‌డి ఆరిపోయాక క్రీం లేదా మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా చేసినా కూడా కాలి ప‌గుళ్ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

5. ఒక క‌ప్పు వెనిగ‌ర్ లేదా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కొద్దిగా గోరు వెచ్చ‌గా ఉన్న నీటిలో క‌ల‌పాలి. ఆ నీటిలో పాదాల‌ను 15 నిమిషాల పాటు ఉంచి స్క్ర‌బ్బ‌ర్ స‌హాయంతో శుభ్రంగా క‌డ‌గాలి. అనంత‌రం పెట్రోలియం జెల్లీ లేదా మాయిశ్చ‌రైజ‌ర్‌ను పాదాల‌కు రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి.

6. గోరువెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం వేసి ఆ నీటిలో పాదాల‌ను 10 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం పాదాల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి ఆరాక మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. దీంతో పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి.

pumic-stone-on-feet

7. అర‌టిపండు తొక్క‌ల‌ను సేక‌రించి వాటిని పేస్ట్‌లా మిక్సీ పట్టాలి. ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌పై రాసి 15-20 నిమిషాలు ఆగాక నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. ఇలా రోజూ చేస్తే కాలి ప‌గుళ్లు వెంట‌నే తగ్గిపోతాయి.

8. ఒక టేబుల్ స్సూన్ ఓట్ మీల్ పౌడ‌ర్‌, కొద్దిగా జుజుబా ఆయిల్‌ను తీసుకుని పేస్ట్‌లా క‌ల‌పాలి. ఈ పేస్ట్‌ను పాదాల‌పై రాసి 30 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం క‌డిగేయాలి. నిత్యం ఇలా చేస్తే కాలి ప‌గుళ్లు త‌గ్గుతాయి.

Comments

comments

Share this post

scroll to top