నేషనల్ లెవల్ బాక్సర్…గోల్డ్ మెడలిస్ట్…ఇప్పుడు పాచిపని చేసుకుంటుంది…ఎందుకో తెలుసా…

మనదేశంలో చెడుకి జరిగినంత ప్రచారం మంచికి జరగదు…మన దగ్గరే కాదు ఎక్కడైనా అలాగే ఉంటుందేమో..మనలో చాలామందికి రిషి మిట్టల్ ఎవరో తెలుసా..కనీసం ఆ పేరు విన్నట్టైనా అన్పించదు..కానీ శ్రీశాంత్ తెలియని వాళ్లుండరు..దీనికి కారణం అది మన తప్పు కాదు ప్రజలకు ఏ సమాచారం చేరవేయాలి అని తెలియని మీడియాది…

ఇప్పడు టాఫిక్ మీడియా కాదు..రిషి మిట్టల్…పద్నాలుగేళ్ల అమ్మాయి.. నేషనల్ లెవల్  బాక్సర్…46కేజీల విభాగం లో హర్యానా రాష్ట్రం తరపున బంగారు పథకం అందుకున్న బాక్సర్….గతేడాది తల్లిదండ్రుల్ని కోల్పోయిన రిషి ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా పనిమనిషిగా పని చేసుకుంటుంది.. స్కూల్ ఫీజ్ కట్టుకోవడం కోసం పాచిపని చేసుకుంటుంది. పదోతరగతి పరీక్ష ఫీజ్  కట్టుకోవడం కోసం అంట్లు తోముతుంది..ఉన్న ఒక్క అన్న కూడా ఇంటికి దగ్గరలో ఒక దుఖాణం లో పని చేస్తున్నాడు..తన సంపాదన అంతంత మాత్రమే….

గోల్డ్ మెడల్ అంటే ఆషామాషి కాదు ప్రత్యర్దితో ఎంతగా తలపడకపోయుంటే ఆ స్థాయికొచ్చుంటుంది..ప్రత్యర్దినైతే ఓడించగలిగింది కాని విధి చేతుల్లో ఓడిపోయింది గతేడాది తల్లిదండ్రుల్ని కోల్పోయింది.మేరికోం అంతటి బాక్సర్ కావాలనుకున్న తన కలల్ని పేదరికం అంతం చేసేసింది…

కేవలం రిషి మిట్టల్ మాత్రమే కాదు ఎంతో మంది క్రీడాకారులు కుటుంబ పరిస్థితుల రిత్యా,ఆర్ధిక కారణాల రిత్యా,సరైన ప్రోత్సాహంలేక ఇళ్లలోనే మగ్గిపోతున్నారు…కేవలం ఒకటి రెండు క్రీడలపైన..లేదంటే ఒకరిద్దరి గెలుపుకే నజరాణాలు ప్రకటిస్తున్నంత కాలం ఇలాగే ఉంటుంది పరిస్థితి…పథకాలు వచ్చిన వారికి కోట్లకు కోట్లు ప్రకటించే గవర్నమెంట్లు అలాంటి పథకాలు తెచ్చే మరింత మందిని తయారు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కదా….

 

Comments

comments

Share this post

scroll to top