అభివృద్ధిలో స‌గ‌మైనా చ‌ట్ట‌స‌భ‌ల్లో చోటేది .? అతివ‌ల కోసం కొత్త పార్టీ.!!

ఆకాశంలో స‌గం.అభివృద్ధిలో.స‌మాజంలో అన్నింటా .అన్ని రంగాల‌లో మ‌హిళ‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కోట్లాది కుటుంబాల‌న్నీ వారి మీదే ఆధార‌ప‌డ్డాయి. అంత‌రిక్షంలోను.ఆట‌ల్లోను.ర‌క్ష‌ణ‌, ఆయుధ రంగాల్లోను.వ్యాపార ప‌రంగా.కంపెనీల ఏర్పాటులోను.స‌క్సెస్ ఫుల్‌గా నిర్వ‌హించ‌డంలోను.ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ , టెలికాం, డిజిట‌ల్, సోష‌ల్ , ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాల‌తో పాటు కీల‌కమైన రాజ‌కీయ రంగంలో రాణిస్తున్నారు. త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఈ దేశాన్ని ఇందిరా గాంధీ ప‌రిపాలించారు. ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా పేరొందారు. కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ జ‌వ‌స‌త్వాలు క‌ల్పించారు. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత ఒక చ‌రిత్ర సృష్టించారు. ఆట‌ల్లో సానియా మీర్జా, సింధూ, నైనా సెహ్వాల్, న‌ట‌నా ప‌రంగా చూస్తే దీపికా ప‌దుకొనే, ప్రియాంక చోప్రా ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో పేరొందారు. దేశానికి స్వేచ్ఛ ల‌భించి 72 ఏళ్ల‌వుతున్నా ఇంకా మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు ద‌క్క‌డం లేదు. వంద కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్న ఈ దేశంలో స‌గానికి పైగా మ‌హిళ‌లే ఉన్నారు. అయినా వివక్ష ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. విద్యా ప‌రంగా, ఆరోగ్య ప‌రంగా, రాజ‌కీయ ప‌రంగా, సామాజిక ప‌రంగా , అవ‌కాశాల ప‌రంగా, కుల‌మ‌తాల ప‌రంగా అన్నింటా వారికి అన్యాయ‌మే జ‌రుగుతోంది.

national womens party

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌లో .ఆయా రాష్ట్రాల‌లో క‌నీసం 33 శాతం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యానికి నోచుకోని దౌర్భాగ్య ప‌రిస్థితిని మ‌హిళ‌లు ఎదుర్కొంటున్నారు. ఐటీ ప‌రంగా దుమ్ము రేపుతున్న వీరికి ఆద‌ర‌ణ క‌రువ‌వుతోంది. స్మార్ట్‌ఫోన్ల పుణ్య‌మా అంటూ లైంగిక వేధింపుల‌కు లోన‌వుతున్నారు. ఎన్నో హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌లు, మాన‌భంగాల‌కు గుర‌య్యేది మ‌హిళ‌లే. త‌మ‌కు చ‌ట్ట స‌భ‌ల్లో ప్రాతినిధ్యం క‌ల్పించాల‌ని కోరుతూ మీటూ , ఛేంజ్ , మాన‌వ హ‌క్కుల సంఘాలు, మ‌హిళా సంఘాలు, మేధావుల ఫోరంలు, ఆందోళ‌న‌లు, పోరాటాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, నిర‌స‌న‌లు, శాంతియుతంగా విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తూనే ఉన్నారు. అయినా ప్ర‌భుత్వాలు ప‌ల‌క‌డం లేదు. స్పందించడం లేదు. న్యాయ స్థానాల‌ను ఆశ్ర‌యిస్తే కానీ చ‌ర్య‌లు తీసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. ప‌రిపాల‌న ప‌రంగా విప‌రీత‌మైన వివ‌క్ష‌కు లోన‌వుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

తామూ మ‌నుషుల‌మేన‌ని.త‌మ‌కు హ‌క్కులున్నాయ‌ని, వాటిని సాధించు కోవాలంటే త‌మ‌కూ ఓ రాజ‌కీయ పార్టీ అవ‌స‌ర‌మ‌ని మ‌హిళ‌లంతా ఏక‌మై .ఏకంగా స్వంతంగా కొత్త పార్టీని దేశ రాజ‌ధాని ఢిల్లీలో నేష‌న‌ల్ ఉమెన్స్ పార్టీ అంటే జాతీయ మ‌హిళా పార్టీ అనే పేరుతో ప్రారంభించారు. దీనికి చైర్ ప‌ర్స‌న్‌గా శ్వేతా శెట్టి ఉన్నారు. పార్టీ లోగోతో పాటు విధి విధానాలు, కార్యాచ‌ర‌ణ‌, ప్ర‌ణాళిక‌, మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో 50 శాతం మ‌హిళ‌ల‌కు సీట్లు కేటాయించాల‌న్న‌ది వీరి ప్ర‌ధాన డిమాండ్. 2019 సంవ‌త్స‌రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో 272 సీట్ల‌లో త‌మ పార్టీ త‌ర‌పున మ‌హిళా అభ్య‌ర్థులు బ‌రిలో ఉంటార‌ని ఆమె వెల్ల‌డించారు. మ‌హిళా హ‌క్కుల కోసం పోరాటం చేస్తున్న మ‌హిళ‌లు తెలంగాణ‌లో అధికంగా ఉన్నారు. ఈ పార్టీలో మ‌హిళ‌లు ఉంటార‌ని.పురుషుల నుండి విరాళాలు సేక‌రిస్తామ‌ని ఆ పార్టీ చీఫ్ శ్వేతా శెట్టి తెలిపారు. పురుషులు కూడా త‌మ పార్టీలో చేర‌వ‌చ్చ‌ని ఇందులో ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు. త‌మ‌కు స‌పోర్ట్ చేసే మేధావులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యితలు, స్వ‌చ్చంధ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, జ‌ర్న‌లిస్టులు అంద‌రికీ చోటు ఉంటుంద‌న్నారు.

మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్ అయిన శ్వేతా శెట్టి మ‌హిళల హ‌క్కుల కోసం పోరాడుతున్నారు. భ‌ర్త‌లు, పురుషులే అన్ని చోట్లా ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు ఎక్కువ సీట్లు కేటాయించాల‌న్న‌దే మా డిమాండ్ అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌మ పార్టీకి సిలిండ‌ర్ లేదా స్ట‌వ్ గుర్తు కేటాయించాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని కోరామ‌ని ఆమె తెలిపారు. ఒక్క తెలంగాణ మ‌హిళా స‌మితిలో ల‌క్షా 45 వేల మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నార‌ని శ్వేతా శెట్టి వెల్ల‌డించారు. మొత్తం మీద నేష‌న‌ల్ ఉమెన్స్ పార్టీ ఏర్పాటు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భావ సారూప్య‌త క‌లిగిన పార్టీలు , మేధావులు ఎన్ ఓ పీ కి మ‌ద్ధ‌తు ఇస్తే బావుంటుంది. వారి ఆశ‌యానికి చేదోడుగా నిలిచిన వార‌వుతారు.

Comments

comments

Share this post

scroll to top