నటి ఈషాకు ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా ..?

ప్లాస్టిక్‌పై నిషేధం పక్కాగా అమలు కావాలంటే సమస్యపై ప్రజల్లో అవగాహన రావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వివిధ అంశాలపై నెటిజన్లు అడిగే ప్రశ్నలకు వెంటనే స్పందించే కేటీఆర్‌.. తాజాగా సినీనటి ఈషా రెబ్బా కామెంట్‌పైనా స్పందించారు. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌కు ఈషా ట్వీట్‌ చేసింది. ‘అనేక అంశాల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉంది. కానీ ప్లాస్టిక్‌ నిషేధిత రాష్ట్రాల్లో తెలంగాణ పేరు లేకపోవడం నిరాశ కలిగిస్తోంది’ అంటూ ఆమె రాసింది. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు.

‘చట్టప్రకారం నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ప్లాస్టిక్‌ నిషేధం జరగదు. నిషేధం పక్కాగా అమలు కావాలంటే అధికారులు, తయారీదారులు, ప్రజలకు సమస్య తీవ్రత గురించి అవగాహన కలగాలి. దీనిని ఓ పద్ధతి ప్రకారం అమలుచేసేందుకు ప్రణాళిక రచిస్తున్నాం’ అని ఆమెకు బదులిచ్చారు. మళ్లీ స్పందించిన ఈషా.. ‘దీనికి నేను అంగీకరించను. మీలాంటి యువ, సమర్థుడైన నాయకుడు ఉండగా ప్లాస్టిక్‌ నిషేధం అసాధ్యమని నేను అనుకోను. ప్లాస్టిక్‌ నిషేధంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపండి’ అంటూ బదులిచ్చారు.

Tweet:

Comments

comments

Share this post

scroll to top