70 రోజుల పాటు లేవకుండా బెడ్‌పై పడుకుంటే నాసా రూ.12 లక్షలు ఇస్తుందట..!

ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే అసలు పనిచేయని వారిని మాత్రం సోమరిపోతులని పెద్దలు తిడుతుంటారు. ఏదైనా ఒక పని చేసుకుని బతకాలని, ఊరికే తిని పడుకుంటే జీవితం ఎలా సాగుతుందని ఒకటే పోరు పెడుతూ ఉంటారు. కానీ అలా తిని పడుకోవడం కూడా ఒక పనే అని మీకు తెలుసా? అవును, అమెరికాలోని నాసా (నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) వారు ఇప్పుడు తిని పడుకునే వారిని జీతమిచ్చి మరీ తీసుకుంటున్నారు తెలుసా? అవునా, అని ఆశ్చర్యపోకండి. ఇది నిజమే.

sleeping-on-the-bed

నాసా సంస్థ 70 రోజుల పాటు లేవకుండా బెడ్‌పై పడుకుని ఉండే వారికి దాదాపు 18వేల డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.12 లక్షలు) ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆ సంస్థ ఓ ప్రయోగంలో భాగంగా చేపట్టింది. ఇందులో పాల్గొనేవారు 70 రోజుల పాటు బెడ్‌పై పడుకునే ఉండాలి. ఏమాత్రం లేవకూడదు. వారికి కావల్సిన అన్ని సదుపాయాలను బెడ్‌పైనే అరేంజ్ చేస్తారు. అయితే బెడ్‌పై పడుకునే వారు టైమ్ పాస్ కోసం బుక్స్ రీడింగ్, స్కైప్‌లో మాట్లాడడం, స్మార్ట్‌ఫోన్, వీడియో గేమ్స్ ఆడడం, కంప్యూటర్స్ ఉపయోగించడం వంటి పనులు చేసుకోవచ్చు. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

sleeping-on-the-bed

నాసా ఈ ప్రయోగాన్ని ఎందుకు చేపట్టిందంటే అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది కదా! ఆ సమయంలో వారు అన్ని రోజుల పాటు బెడ్‌పై ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి దేహం ఎలా ఉంటుంది, ఎలా స్పందిస్తుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసమే నాసా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని వల్ల భవిష్యత్తులో ఎవరైనా వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో ముందుగానే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా 70 రోజుల పాటు బెడ్‌పై పడుకునే వారికి నాసా సైంటిస్టులు పలు వైద్య పరీక్షలు కూడా చేస్తారు. వాటిని విశ్లేషించి తమ ప్రయోగానికి ఉపయోగించుకుంటారు. అదన్నమాట సంగతి. అందుకే నాసా తిని పడుకునే వారికి అంతటి అవకాశాన్ని కల్పించింది.

Comments

comments

Share this post

scroll to top