మోడీ పై నటి సంచలన ట్వీట్… నెటిజన్లు ఎలా ఫైర్ అయ్యారో చూడండి ..??

పాకిస్తాన్ పై భారత వాయుసేన చేసిన మెరుపు దాడి నేపధ్యంలో తాను నిద్రపోలేదని ప్రధాని మోడీ పేర్కొన్నట్టు పలు టీవీ ఛానళ్లలో ప్రసారమైన విషయం తెలిసిందే. దీనిపై సినీ నటి స్వర భాస్కర్ ట్విట్టర్ లో స్పందించారు. ఆమె ట్వీట్లపై మోడీ అభిమానులు స్వర భాస్కర్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పనిలేని వాళ్లే పని చేసే వాళ్లపై పడి ఏడుస్తారు అంటూ మండిపడుతున్నారు.


మోడీ పై వచ్చిన వార్తలపై స్పందిస్తూ… “ ఇది ఉద్యోగంలో భాగమా? కాదు. ఇందుకోసం అదనంగా పాయింట్లు దక్కాల్సిందే” అని ట్వీట్ చేసారామె. దీంతో ఆమెపై మోడీ అభిమానులు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. “మీరు 18 గంటలు పనిచేస్తారా? లేదు కదా.. ఎందుకంటే ఇప్పుడు మీకు అసలు పనే లేదు.. అర్బన్‌ నక్సలైట్ల కన్నా హీనంగా తయారయ్యారు మీరు” అంటూ మోడీ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. దేశం కోసం మోడీ ఇంత కష్టపడుతుంటే మీరు మోడీని విమర్శించడానికి బుద్ధి లేదా… అయినా ప్రధానిని ఎందుకు విమర్శిస్తున్నావ్… ఆ పోస్టును వెంటనే డిలీట్ చెయ్యాలి అంటూ డిమాండ్ చేసారు. ఆమెపై అంతలా ట్రోలింగ్ జరుగుతున్నా ఆ పోస్టును ఆమె డిలీట్ చెయ్యలేదు.

Comments

comments

Share this post

scroll to top