నారాయణ గారు తనకొడుకు “నిషిత్” తో చివరగా ఏం మాట్లాడారో తెలుసా? కొడుకు గురించి ఆ విషయం ఆయనకు తెలీదట!

ఏపీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత “నారాయణ” గారి తనయుడు “నిషిత్” నిన్న అతి వేగం కారణంగా ఆక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పుడు మంత్రి నారాయణ గారు “లండన్” లో ఉన్నారు. ఈ రోజు ఉదయం నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరులో అంత్యక్రియలు జరిగాయి.

ఆక్సిడెంట్ జరగడానికి ముందు మంత్రి నారాయణ గారు కొడుకు నిషిత్ కు ఫోన్ చేసి మాట్లాడారు అంట. “నాన్నా.. నిషి ఎక్కడున్నావ్‌. జాగ్రత్తగా ఇంటికి వెళ్లు కన్నా!’’ ఇవే ఆయన తన కొడుకుతో చివరగా అన్న మాటలు. మంగళవారం రాత్రి 11 గంటలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. నిషిత్‌ మరణ వార్త ఉదయం 5 గంటలకు నారాయణ విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌ వేమిరెడ్డి విజయభాస్కర్‌ రెడ్డికి చేరింది. అయితే… ఈ విషయాన్ని లండన్‌లో ఉన్న మంత్రి నారాయణకు ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు లండన్‌లో సమయం అర్ధరాత్రి రాత్రి 2 గంటలు ఉంటుంది. మంచి నిద్రలో ఉండటంవల్ల కావొచ్చు, నారాయణ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తరవాత చూసుకొని ఆయనే ఫోన్ చేసారు. అప్పటికే విజయభాస్కర్‌ రెడ్డిని కూడా టెలీకాన్ఫరెన్స్‌లో తీసుకుని ఓఎ్‌సడీ మంత్రి నారాయణతో మాట్లాడారు. ‘‘సార్‌.. రోడ్డు ప్రమాదంలో నిషిత్‌ బాబుకు గాయాలయ్యాయి. మీరు వెంటనే బయల్దేరి ఇండియాకు రావాలి’’ అని చెప్పారు.

టీవీల్లో వస్తున్న సమాచారం చూసి అక్కడే నారాయణ కుప్పకూలిపోయారు. ఇండియాకి వచ్చిన నారాయణ కొడుకు మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని తనకు తెలియదని, తెలిసి ఉంటే వారించేవాడినని నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు. తనతో కలిసి ప్రయాణించినప్పుడు మామూలు వేగంతోనే వెళ్లేవాడని, అందుకే తానెప్పుడు అనుమానించలేదని మంత్రి నారాయణ చెప్పారు. అప్పటికీ వేగంగా వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించానని ఆయన తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top