నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలిపే విగ్రహాలతో వెలసిన గుడి. దానిపేరు నరకపు గుడి.!?

మనిషి భూలోకంలో చేసే తప్పులకు నరకంలో యమధర్మరాజు చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తాడంటారు. నూనెలో వేసి వేయించడం, శూలాలతో పొడవడం, నెత్తుటి ముద్దపై కారం చల్లడం, కొరడాలతో హింసించడం.. ఇలా తలచుకుంటేనే భయంతో ఒళ్ళు  కంపించే శిక్షల లిస్ట్ ను చదువుతారు మనోళ్ళు  . అయితే పైన ఎక్కడో  యమకలోకంలో జరిగే ఈ శిక్షలను భూమిపై ఒక గుడిలా స్థాపించారు. దానికి ‘నరకం గుడి’ అని పేరు కూడా పెట్టారు థాయ్ లాంట్  వాసులు.

1

థాయిలాండ్ లోని చైంగ్ మయి ప్రాంతంలో ‘వట్ మే కేట్ నోయి’ గుడి. దీనినే నరకపు గుడి అంటారు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ పాపం చేసిన వ్యక్తులను ఎలా శిక్షిస్తారో అలా శిక్షించినట్లుగా ఆ విగ్రహాలు ఉంటాయి. సాదారణంగా గుళ్ళు, గోపురాలు శాంతి., ప్రశాంతలకు చిహ్నంగా చెబుతారు. అయితే థాయిలాండ్ లో ఉన్న ఈ నరకపు గుడిలో మాత్రం మానవులు చేసే తప్పులకు ఎలాంటి శిక్షలను అనుభవించాలో తెలిపేలా ఉంటాయి ఆ విగ్రహాలు.
2_1455780497
బౌద్ధ సన్యాసి ప్రా కృ విశంజలికోన్ మానవ పాప పరిణామాలు మనిషి చనిపోయిన తర్వాత ఎటువంటి శిక్షలకు గురవుతాడో ఈ గుడిలో తెలిపాడు. కడుపులో నుండి చీల్చుకుంటూ వెళ్ళే శూలాలు, శరీరాలను రెండుగా చీల్చి ఒక ఇనుప చువ్వలో ఉంచడం.. వినడానికి, చూడటానికే భరించలేనంతగా ఈ విగ్రహస్థాపన ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది సన్యాసులు ప్రశాంతతమైన జీవితం ఎలా గడపాలి, మనిషి ఎలాంటి జీవితంలో ఉండాలని కొందరు చెబుతుంటే, ప్రా  కృ విశంజలికోన్ మాత్రం మనిషి ఎలాంటి తప్పులు చేయకుండా  హెచ్చరిస్తూ, అ తప్పులు చేయడం వలన కలిగే శిక్షలను భయపెడుతూ ఈ నరక గుడిని మొదలుపెట్టాడు.
4_1455780498
అయితే ఈ గుడి మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. కొందరు ఇక్కడికి రావడానికి భయపడుతున్నా మరికొందరు మాత్రం ఈ ప్రదేశాన్ని చూడటానికి ఉత్సాహంగా వస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇక్కడే పెళ్ళిళ్ళు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు కూడా ఇక్కడ చేస్తున్నారట. ఏది ఏమైనా మనిషి చేసే తప్పులకు శిక్షలు ఎలా ఉంటాయో భయపెట్టి, ఒక విధంగా ఆ తప్పులను ఆపుతున్నాడు అనే చెప్పాలి. థాయిలాండ్ వెళితే మీరూ ఈ నరకపు గుడిని చూసిరండి.
7_1455780499

Comments

comments

Share this post

scroll to top