భయంకరమైన నర ద్రుష్టి నుండి బయట పడాలి అంటే.?

అప్పటి దాకా ఆరోగ్యం గా ఉన్న వ్యక్తి సడెన్ గా అనారోగ్యానికి గురైనా… పంట చేతికొచ్చే సమయానికి అకారణంగా ఎదో జరిగి పంట చేతికి రాకపోయిన ఇంట్లో పెద్దలు ఎక్కువగా వాడే పదం దిష్టి లేదా నర దృష్టి. మనం నిత్యం చూస్తుంటాం ఆటోలు, లారీల వెనక నరఘోష నీకో నమస్కారం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు నిజంగా దిష్టి తగులుతుందా. ఎవరి చూపైనా మన మీద ప్రభావం చూపుతుందా… ఇప్పుడు తెలుసుకుందాం…
మనలో ప్రవహించే విద్యుత్ శక్తి మన కళ్ల నుంచి బయటకు వస్తుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్ని సార్లు కూడా ఒకేలా ఉండవు. మన కళ్ల నుంచి విద్యుత్ తరంగాలు బయటకు రావడంతో ఖచ్చితంగా చూపు ప్రభావం ఉంటుంది. కొందరి ఆలోచనా సరళి లాగే చూపులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాంటి చూపు అందరికి మేలు చేస్తుంది.

ఎక్స్ రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది.
కాబట్టి ఈర్ష్యా అసూయలతో కూడిన చూపు ఎప్పుడైతే మన మీద పడుతుందో దాని ప్రభావం మన మీద ఉంటుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు. దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరిపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పు తో దృష్టి తీస్తారు. కొంత మంది పెద్దలు చిన్న పిల్లలు ఆపకుండా ఏడ్చినా సడెన్ గా వారి ఆరోగ్యం దెబ్బతిన్నా… అప్పటిదాకా ఆడుకుంటున్న వాళ్లకి దెబ్బలు తగిలినా.. ఏదైనా సందర్భంలో ఇతరులు పోగిడినా వెంటనే చేతిలోకి ఉప్పు తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి….థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు. ఆ తర్వాత ఆ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తారు.

ఇంటికి నర దృష్టి పోగొట్టే దృష్టి గణపతి.. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లైతే శుభ దృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి. నర దృష్టి పోవాలంటే ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది.

Comments

comments

Share this post

scroll to top