నాన్నకు ప్రేమతోలో కన్నీరు పెట్టించే సీన్..! “రాధ” సినిమాలో “సప్తగిరి” చేసింది చూస్తే నవ్వాపుకోలేరు!

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి ని గుర్తు చేసుకుంటూ… నాన్న కు ప్రేమతో  అంటూ ఓ పాటను రచించారు.. ఈ పాటలో దేవిశ్రీ నాన్నపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ పాటను రచించి, సంగీతం అందించడంతో పాటు తన సోదరుడు సాగర్ తో కలిసి పాడారు దేవిశ్రీ.  ఈ పాట లిరిక్స్ చాలా మంది మనస్సులను కరిగించాయి…ఓ సారి ఆ వీడియో చూడండి!

watch video here:

ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ సన్నివేశాన్ని. ఇటీవలే విడుదలైన “శర్వానంద్” “రాధ” చిత్రంలో కమెడియన్ “సప్తగిరి” స్పూఫ్ చేసారు. కామెడీ ఫుల్ గా పండించారు. ఆ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.థియేటర్ లో ఈ సీన్ కు ఆడియన్స్ నవ్వుతూనే ఉన్నారు. ఓ సారి వీడియో ను చూసేయండి!

watch video here:

రాధ సినిమా కథేంటి అంటే..?

రాధకృష్ణ.. చిన్నప్పటినుండి కృష్ణతత్వానికి ఆకర్షితుడై ఎప్పుడు భగవద్గీత వింటూ భగవంతుడే అంతా నడిపిస్తుంటాడని నమ్ముతుంటాడు. చిన్నప్పుడు అతను ప్రమాదంలో ఉన్నప్పుడు ఓ పోలీస్ కాపాడతాడు. అతనే కృష్ణుడిని అని నమ్మి శిష్ట రక్షణ దుష్ట శిక్షణకై పోలీస్ అవతారం ఎత్తాలి అనుకుంటాడు. అదే కసితో పెరిగి పెద్దవాడైన రాధకృష్ణ.. యూనిఫాం లేకపోయినా క్రిమినల్స్ ఆట కట్టిస్తుంటాడు. డిపార్ట్మెంట్ కు అతను సేవను గుర్తించిన డీజీపీ రాధకు ఎస్ ఐ గా ఉద్యోగం ఇస్తారు. వరంగల్‌లోని బర్సాలపల్లెకు ఆన్‌ డ్యూటీ వెళ్లిన రాధాకృష్ణ, అక్కడ ఇంజనీరింగ్‌ చదివే రాధ(లావణ్య త్రిపాఠి)ను చూసి ప్రేమిస్తాడు. రాధ కూడా రాధాకృష్ణను ప్రేమిస్తుంది. కానీ పల్లెటూళ్ళో కేసులేవీ ఉండకపోవడంతో మళ్ళీ తన పోస్టింగ్‌ను హైదరాబాద్‌కు మార్పించుకుంటాడు.

మ‌రోవైపు రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తాయి.పీపుల్స్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గొడవలు జరుగుతుంటాయి.ముఖ్యమంత్రి రేసులో సూరిరెడ్డి(ఆశిష్‌ విద్యార్థి), సుజాత(రవికిషన్‌) పోటీపడతారు. చివరకు సుజాతనే సీఎం అభ్యర్థిగా హై కమాండ్‌ నిర్ణయిస్తుంది. సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ లో కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా చనిపోతారు. పోలీసులు తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించటం కారణంగానే ఇలా జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. పోలీసుల‌న్నా, పోలీస్ శాఖ‌న్నా విప‌రీత‌మైన గౌర‌వం ఉండే ఎస్‌.ఐ.రాధాకృష్ణ సుజాత‌కు ఎలా బుద్ది చెప్పాడు? వాళ్ల ఆట రాధకృష్ణ ఎలా కట్టించాడు..? అన్నదే మిగతా కథ.

Comments

comments

Share this post

scroll to top