అప్పట్లో బాహుబలి అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చిన కాయిరా సంధు ఇప్పుడు నాన్నకు ప్రేమతో పై రివ్యూ!

రివ్యూలు మరీ ఎక్కువై పోయాయి. కొందరు సినిమా యూనిట్ మీద అక్కసుతో మరికొందరు సినిమా యానిట్ మీద ప్రేమతో తమకు ఇష్టం వచ్చినట్టు రివ్యూ లు ఇవ్వడం ఇప్పుడు మాములు విషయం అయిపోయింది. సినిమా చూడకుండా కూడా రివ్యూలు ఇచ్చే వారి సంఖ్య చాలానే ఉంది. అయితే ఇంకా విడుదల కూడా కాని సినిమాలపై రివ్యూ లివ్వడం… ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.

కాయిరా సంధు….ఈ పేరు మీలో చాలా మందికి తెలియకపోవొచ్చు. కానీ ఈ పర్సన్ ప్రముఖ UAE రివ్యూవర్ అంట… బ్లాక్ బాస్టర్ హిట్ అయిన రాజమౌళి బాహుబలి సినిమా విడుదల కాకమునుపే ఈమె ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. సినిమా బాలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిందీమె, బాహుబలి తర్వాత కాయిరా సంధు కండ్లు Jr.NTR నాన్నకు ప్రేమతో పై పడింది.  తాను NTR నాన్నకు ప్రేమతో సినిమా ఫస్ట్ ప్రింట్ చూశానని  చాలా బాగుందని, ఇందులో NTR చాలా బాగున్నారాని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.బాహుబలి సినిమాతో అంచనాలు తప్పిన  కాయిరా రివ్యూ ఇప్పుడైనా కరెక్ట్ అవుతుందా? లేదా చూడాలి.

For More Details Watch Video:

Comments

comments

Share this post

scroll to top