వరుస హిట్లతో దూసుకెళ్తున్న “నాని” కి “కృష్ణార్జున యుద్ధం” తో బ్రేక్ పడిందా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): కృష్ణార్జున యుద్ధం (krishnarjuna yuddam)

Cast & Crew:

నటీనటులు: నాని,అనుపమ పరమేశ్వరన్,రుక్సర్ దిల్లాన్,బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం: Hiphop Tamhiza
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది

Story:

పల్లెటూరిలో ఉండే కృష్ణ (నాని) , యూరోప్ లో ఉండే అర్జున (నాని) ల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిత్తూర్ లో కృష్ణని పరిచయం చేస్తూ సినిమా కథ మొదలవుతుంది. రియా (రుక్షర్ మిర్) ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కృష్ణ. సుబ్బలక్ష్మి (అనుపమ) ని పెళ్లి చేసుకోవాలని అర్జున్ ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో రియా ని కిడ్నప్ చేస్తారు. అదే సమయంలో అర్జున్ కూడా ఓ సమస్యలో పడతారు. కిడ్నప్ అయిన రియని కాపాడాలి అనుకుంటాడు కృష్ణ. ఆ ప్రయత్నంలో కృష్ణ తో అర్జున్ కాలుస్తాడు. ఇంతకీ కిడ్నప్ చేసింది ఎవరు? చివరికి కృష్ణార్జునులు గెలిచారా లేదా? అనేది తెలియాలంటే “కృష్ణార్జున యుద్ధం” సినిమా చూడాల్సిందే.!

Review:

కృష్ణ, అర్జున్‌గా రెండు విభిన్నపాత్రల్లో నాని తన స్థాయి నటనతో ప్రేక్షకుల్ని మరోసారి మెస్మరైజ్ చేశాడని నాని స్టైల్ ఆప్.. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌టైన్ చేశాడని టాక్. కథలో వచ్చే ఎమోషన్ సీన్లను బాగా పండించాడు. ఫస్టాఫ్ మొత్తం మంచి గ్రిప్పింగ్‌తో కథ నడిచినా సెకండాఫ్ కాస్త నెమ్మదించిందనే మాట వినిపిస్తోంది. నాని రెండు పాత్రలకు న్యాయం చేస్తూ అటు మాస్, అండ్ క్లాస్ ఆడియన్స్ ఆకట్టుకునే దర్శకుడు చాలా జాగ్రత్తగా నాని క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఇక అనుపమ పరమేశ్వరన్ నటనకు సినిమాకు హెల్ప్ అయ్యిందని, మరో హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ పాత్రకు న్యాయం చేసిందంటున్నారు. ఇక సినిమాకు మ్యూజిక్ ప్రధాన బలం అనే చెప్పాలి. తమిళ సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ చక్కటి బాణీలు అందించారు. ముఖ్యంగా ‘దారిచూడు మామ’ సాంగ్‌ థియేటర్‌ ప్రేక్షకుల బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.

Plus Points:

ఫస్ట్ హాఫ్
ఎంటర్టైన్మెంట్
నాని యాక్టింగ్
సంగీతం
ఎమోషన్స్

Minus Points:

సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే

Final Verdict:

ఫస్ట్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ పర్లేదు.

AP2TG Rating:  3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top