నాని… కృష్ణగాడి వీర ప్రేమకథ రివ్యూ & రేటింగ్ ( తెలుగులో)

Poster:

12472690_963896020351332_71094620019439248_n

 

Cast & Crew:

నటీనటులు: నాని, మెహరీన్,మురళీశర్మ,సంపత్ రాజ్
దర్శకత్వం:హను రాఘవపూడి
సంగీతం:  విశాల్ చంద్రశేఖర్
నిర్మాత:రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
Story: 
తన ప్రేమకోసం ఫ్యాక్షన్ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక  యువకుడు ఏం చేశాడు అనేది కృష్ణగాడి వీర ప్రేమగాధ. అనంతపురం జిల్లా హిందూపురం నేఫధ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఊరి పెద్ద రాజన్న (మహదేవన్). రాజన్న వెన్నంటే ఉంటూ అతడికోసం ప్రాణాలిచ్చే నమ్మినబంటు రామరాజు (రామకృష్ణ). అదే ఊరిలో బాలకృష్ణ వీరాభిమాని అయిన కృష్ణ (నాని) బోర్ వెల్స్ జీవనం సాగిస్తుంటాడు.పిరికివాడు. తన చిన్నతనం నుండే రామరాజు చెల్లెలు మహాలక్ష్మి (మెహరీన్) ని ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా చెప్పలేడు. ఇక రామరాజు అనే కృష్ణకు చచ్చేంత భయం. మరోవైపు మహాలక్ష్మికి పెళ్లి చేయాలని ఇంట్లో డిసైడ్ అవుతారు. అయితే తను డిగ్రీ పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని మహాలక్ష్మి గట్టిగా ఉంటుంది. అందుకని అదేపనిగా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు  పెదనాన్న రాజన్నను చూడాలని పండుగ సెలవులకు రాజన్న సోదరుడు(సంపత్ రాజ్) పిల్లలు ఊరికి వస్తారు. రాజన్న తమ్ముడు హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్.ఇక ఇదే సమయంలో రాజన్నపై అటాక్ జరుగుతుంది. రాజన్నను  షూట్ చేస్తారు, పిల్లలను ఎత్తుకెళ్ళడానికి విలన్లు ప్రయత్నం చేయగా, ఆ అటాక్ నుండి రామరాజు పిల్లలను కాపాడి, సిటీలో ఉన్న సంపత్ కు అప్పగించాలని, అలా చేస్తే తన చెల్లెలు మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తానని రామరాజు మాట ఇస్తాడు.  మహాలక్ష్మి ప్రేమ కోసం కృష్ణ ఆ బాధ్యతను తీసుకుంటాడు. పిల్లలను తీసుకొని కృష్ణ హైదరాబాద్ వెళ్తుండగా, మహాలక్ష్మిని విలన్లను ఎత్తుకెళ్తారు. మహాలక్ష్మి కావాలంటే, పిల్లలను అప్పజెప్పాలని బెదిరిస్తారు. మరి ఆ పిల్లలను విలన్లకు అప్పగించి, తన ప్రేమను గెలుచుకున్నాడా? రాజన్నను అటాక్ చేసింది ఎవరు అనేది మిగిలిన కథాంశం.
PLUS POINTS:
  • నాని
  • కథ,కథనం
  • సంగీతం
  • క్లైమాక్స్
MINUS POINTS:
  • స్లో అయిన సెకండాఫ్
Verdict: పిరికివాడి వీరప్రేమగాధ
Rating: 3/5
Trailer:

Comments

comments

Share this post

scroll to top