నాని ” జెంటిల్ మన్” మూవీ రివ్యూ & రేటింగ్.( తెలుగులో..)

Cast & Crew:

  • నటీనటులు : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్
  • సంగీతం : మణిశర్మ
  • దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
  • నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్

nani_gentleman_first_look_poster

Story:

చిన్న వయసులోనే యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ అందుకుంటాడు జయరామ్( నాని). ఇతనిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య (సురభి) ఫాథర్, ఇతను కూడా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ సంబంధానికి జయరామ్ కూడా ఒప్పుకోవడంతో వీరి పెళ్లి సెట్ అవుతుంది. పెళ్ళికి ఇంకా టైమ్ ఉండడంతో సురభి లండన్ లో తన ఫ్రెండ్స్ ను కలవడానికి వెళుతుంది. తిరిగి ఇండియాకు వచ్చే సమయంలో ఫ్లైట్ లో క్యాథరిన్(నివేదా) సురభికి మంచి ఫ్రెండ్ అవుతుంది. సురభిని రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తుంటాడు జయరామ్.జయరామ్ ను చూసిన క్యాథరిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే జయరామ్ అచ్చం తన లవర్ గౌతమ్ (నాని-2) లాగే ఉంటాడు . అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఎలా ఛేదించింధి. గౌతమ్ కు జయరామ్ కు మద్య ఉన్న సంబంధమేంటి అనేదే అసలు కథ.

Plus Points:

  • నాని అద్భుత నటన.
  • స్క్రీన్ప్లే
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
  • ఫస్టాఫ్ క్లీన్ సినిమా సెకండాఫ్ థ్రిల్లర్ టచ్….ఒక్క టికెట్ మీద రెండు జానర్ లను చూపించాడు.

Minus Points:

  • ఇబ్బందిపెట్టేవిగా ఉన్న సాంగ్స్.
  • ఫస్టాఫ్ కాస్త టైటిల్ కు దూరంగా క్యారీ అవ్వడం.

Verdict: సక్సెస్ కొట్టిన సరికొత్త పాత్ర..నాచురల్ స్టార్ నాని ఖాతాలో మరో విజయం.
Ratting:2.75/5
Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top