దుఃఖాన్ని దిగమింగుకొని 4 వికెట్లు తీశాడు.! మ్యాచ్ తర్వాత కంటతడి పెట్టుకున్న ఢిల్లీ బౌలర్..!

ఏ ఆట అయినా ఆడుతున్న‌ప్పుడు క్రీడాకారులు ఆట పైనే దృష్టి పెట్టాలి. చివ‌రి వ‌ర‌కు పోరాడాలి. అలాగైతేనే విజ‌యం వ‌రిస్తుంది. కానీ ఆట మ‌ధ్య‌లో త‌మ కుటుంబం లేదా త‌మ‌కు తెలిసిన వారి గురించి ఏదైనా చెడు వార్త తెలిస్తే.. ఇక అలాంటి ప‌రిస్థితుల్లో ఏ ఆట‌గాడు అయినా ఆట‌పై ధ్యాస పెట్ట‌లేడు. ఓ వైపు ఆ చెడు వార్త మ‌న‌స్సును తొలిచేస్తుంటుంది. అలాంటి స్థితిలో ఏ ఆట‌గాడు కూడా ఆట‌లో రాణించ‌లేడు. కానీ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు ఆడుతున్న ఆస్ట్రేలియా పేస‌ర్ ఆండ్రూ టై మాత్రం అలా కాదు. ఓ వైపు త‌న నానమ్మ చ‌నిపోయింద‌ని తెలిసినా.. ఆట‌పైనే దృష్టి పెట్టాడు. ఏకంగా 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

పంజాబ్‌కు, రాజ‌స్థాన్‌కు తాజాగా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ జ‌ట్టు 158 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ జ‌ట్టు విఫ‌ల‌మైంది. కేఎల్ రాహుల్ మిన‌హా ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో పంజాబ్ రాజ‌స్థాన్‌పై 15 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. అయితే మొద‌ట రాజ‌స్థాన్ జ‌ట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంజాబ్ బౌలింగ్ చేస్తోంది. ఆ స‌మ‌యంలో పంజాబ్ బౌల‌ర్ ఆండ్రూ టై కి చేదు వార్త తెలిసింది. త‌న నాన‌మ్మ చ‌నిపోయింద‌ని స‌మాచారం తెలిసింది. దీంతో అత‌ను షాక్ కు గుర‌య్యాడు. అయినా తేరుకున్నాడు.

ఓ వైపు నానమ్మ చ‌నిపోయింద‌నే బాధ మ‌న‌స్సులో ఉంది కానీ ఆండ్రూ టై మాత్రం త‌న దృష్టిని మ్యాచ్ పైనే నిలిపాడు. దీంతో మ్యాచ్‌లో మొద‌ట రాజ‌స్థాన్ ఆట‌గాడు గౌత‌మ్‌ను ఔట్ చేశాడు. త‌రువాత బెన్ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌, ఉన‌ద్క‌త్‌ల‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. ఈ క్ర‌మంలో ఆండ్రూ టైకి మొత్తం 4 వికెట్లు ద‌క్కాయి. అంతేకాదు ఐపీఎల్ టోర్న‌మెంట్‌లో ఎక్కువ వికెట్ల తీసి లీడింగ్ లో ఉన్న బౌల‌ర్‌గా టైకు ప‌ర్పుల్ క్యాప్ ద‌క్కింది. అయితే మ్యాచ్ అనంత‌రం టై మీడియాతో మాట్లాడుతూ త‌న నాన‌మ్మ మ‌ర‌ణించిన విష‌యం తెలిసి షాక్ కు గుర‌య్యాన‌ని అన్నాడు. అయితే మ్యాచ్‌లో తాను 4 వికెట్లు తీశాన‌ని, ఆ ప్ర‌ద‌ర్శ‌నను త‌న నాన‌మ్మ‌కు అంకితం ఇస్తున్న‌ట్లు చెప్పాడు. ఈ మ్యాచ్ త‌న‌కు భావోద్వేగ‌పూరిత‌మైన మ్యాచ్ అని, త‌న జీవితంలో క‌ఠిన‌మైన రోజ‌ని అన్నాడు. తాను క్రికెట్‌ను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, త‌మ జ‌ట్టులో గొప్ప ఆట‌గాళ్లున్నార‌ని అత‌ను చెప్పాడు. భ‌విష్య‌త్తులోనూ తాను ఇలాగే రాణిస్తాన‌ని అత‌ను ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఏది ఏమైనా ఓ వైపు దుఃఖాన్ని దిగ‌మింగి టై అలా మ్యాచ్ ఆడ‌డ‌మే కాక‌, ఏకంగా 4 వికెట్లు తీశాడంటే నిజంగా అత‌ని ఓపిక‌, స‌హనానికి మెచ్చుకోవ‌చ్చు. అత‌ని నాన‌మ్మ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుందాం..!

Comments

comments

Share this post

scroll to top