ఆంద్రప్రదేశ్ రాజధానికి పాట రాసిన తెలంగాణ లిరిసిస్ట్.. మనం మనం ఒక్కటే.

తెలుగు రాష్ట్రాలు రాజకీయంగా వేరు కావొచ్చు, భౌగోళికంగా వేరు కావొచ్చు, పరిపాలనా పరంగా వేరు కావొచ్చు. కానీ మనసుల పరంగా వేరు కాలేదు, కాకూడదు కూడా.  ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ  అభివృద్ది వైపుగా దూసుకుపోవాలి. దసరా నాడు అత్యంత వైభవంగా , కన్నుల పండుగగా  ఆంద్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన జరగనుంది.దీని కోసం అతిరథ మహారథులు వస్తున్నారు.

భూమి పూజ నుండి రాజధాని అమరావతిపై  ఓ పాట చాలా పాపులర్ అయ్యింది. అదే నమో నమో జనని ఆంధ్రప్రదేశ్ జనని నమ: అనే పాట. అయితే ఈ పాట రాసింది సుద్దాల అశోక్ తేజ. ఆయన తెలంగాణ ప్రాంతం వారు, అయినప్పటికీ ఆంద్రప్రదేశ్ భౌగోళికాన్ని , చరిత్రను , సంస్కతిని, జాతి కోసం పాటు పడిన ప్రతి ఒక్కరిని…. తన పదాల్లో బందిస్తూ అద్బుతమైన రాజధాని గేయాన్ని రాశారు.

ఈ పాట ద్వారా మనం మనం ఒక్కటే అనే సంకేతం కనిపిస్తుంది. ఈ పాట రాసింది సుద్దాల ప్రమ్ తెలంగాణ, మ్యూజిక్ డైరెక్టర్ యశోక్రిష్ణ ఫ్రమ్ తెలంగాణ, రాయించింది ఓల్గా ఆర్చరీస్ ఫ్రమ్ ఆంద్రప్రదేశ్.  ప్రాంత బేధాలకు తావివ్వకుండా ఆంద్రప్రదేశ్ రాజధాని పాటను తెలంగాణ లిరిసిస్ట్ తో రాయించిన పెద్దమనిషులకు, ఆంద్రప్రదేశ్ పాటైన కళాకారులకు ప్రాంతీయ భేషజాలు ఉండవని అద్భుతంగా రాసిన సుద్దాల అశోక్ తేజ, యశోకృష్ణలకు అభినందనలు.

Watch Amaravati Song:

Watch Interview With Suddal On This Song:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top