నవంబర్ 24 న “నమిత” పెళ్లి..! ఎవర్ని పెళ్లి చేసుకోబోతుందో తెలుసా..? శరత్ బాబు – నమిత ఎఫైర్ రూమర్ కి చెక్!

‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ముద్దుగా పలకరించింది బ్యూటీ నమిత. వస్తూ వస్తూనే తెలుగు ఆడియన్స్‌ని క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేసింది. తర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ‘సింహా’లో బాలయ్య పక్కన ఐటెం సాంగ్‌లో కూడా మెరిసింది. బిల్లా లో కూడా స్పెషల్ రోల్ చేసింది.

నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. నా వయసేంటి? .. ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు? అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది.

ఇప్పుడు నమితే స్వయంగా ఈ షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. నమిత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ వీడియోని రిలీజ్‌ చేసింది. ఆ వీడియో ద్వారానే తన భాగస్వామితో కలిసి తన పెళ్లి విషయం చెప్పింది. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది. నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.

నమిత కొన్నేళ్లు వీరా ప్రేమలో వున్నట్లు సమాచారం. ఇక త్వరలో దంపతులు కానున్న నమిత-వీరాలకు రైజాతో పాటు స్నేహితులందరూ శుభాకాంక్షలు తెలపడం ఈ వీడియోలో వుంది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top