నమస్కారం…అంటే ఏంటో తెలుసా?

నమస్తే , నమస్కారం అనే పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా ” నమః ” అనగా “మనిషిలో గల ఆత్మ”ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధమతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.

నమస్కారాలు 4 రకాలు:

సాష్టాంగ నమస్కారం:

మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.

దండ ప్రణామం:

నేలమీద పడిన దండము (కర్రలాగా)శరీరాన్ని భూమిపైవాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామం.

పంచాంగ నమస్కారం:

రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.

అంజలి నమస్కారం:

ఇది సర్వసాధారణమైన రెండుచేతులను కలిపి నమస్కారం అనటం.

Source : Wikipedia

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top