20 ఏళ్ల యువతిని రేప్ చేసిన నలుగురిని పోలీసులు ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.! మానవ మృగాలకు తగిన శాస్తి.!

నా పై అత్యాచారం జరిగింది అని ఒక ఆడపిల్ల బైటికి చెప్పుకుంటే తననే అనుమానంగా చూసే సమాజం మనది..రేప్ ఎలా చేశారు అంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నలడిగే చట్టం మనది..అత్యాచారం జరగడం అంటే ఇక అంతే అక్కడితో తన జీవితం అయిపోయింది అని భావించే వారు ఎందరో ఉన్నారు..రేప్ చేసినవాడికి శిక్షలు పడిన ఘటనలు చాలా స్వల్పం.రేప్ చేసిన వాడిని పట్టుకోవడానికే పోలీసులకు ఎక్కువ సమయం పడుతుంది.ఇకవారికి శిక్ష అమలు చేయడం అనేది తర్వాత విషయం..ఒకవేళ అత్యచారం చేసిన నిందితుడు దొరికితే ఎటువంటి కఠిన శిక్షలు లేకుండా పోలీసుల సంరక్షణలో జైల్లో కూచోబెట్టి మేపుతుంటారు..కాని భోపాల్ పోలీసులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు..

ఇరవై ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులను గంటలోపే అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వీధుల్లో తిప్పారు. జనం వారిని చూడాలని.. పబ్లిగ్గా శిక్ష విధించాలని కోరుకున్నారు. అక్కడక్కడా  వారిని నిలబెడుతూ మహిళలను, అమ్మాయిలను కొట్టమని చెప్పారు. చెప్పులతో, కర్రలతో కొడుతుంటే వారిని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేశారు.శైలేంద్ర అనే వ్యక్తి బాధితురాలిని ఒక రెస్టారెంట్‌కు పిలిచాడు.అక్కడ వారికి ఒక విషయం గురించి గొడవ వచ్చింది. దాంతో ఆమె ఫోన్ లాక్కున్న శైలేంద్ర ఆమెను తన స్నేహితుడి రూమ్ కు తీసుకెళ్లాడు.అక్కడ అతడి మిగతా ఫ్రెండ్స్ సోనూ, ధీరజ్, చిమన్ ఉన్నారు. నిన్ను,నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించిన శైలేంద్ర, ధీరజ్ యువతిపై అత్యాచారం చేయగా.. సోనూ, చిమన్ వారికి సహకరించారు.గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు నలుగురూ పదే పదే ఈవ్ టీజింగ్ చేసినట్టు తేలడంతో వారికి ప్రజల సమక్షంలో బుద్ధి చెప్పారు. ఇక జీవితంలో ఎప్పుడూ ఎవరినీ కన్నెత్తి చూడకుండా జీవితాంతం ఇది గుర్తుండిపోయేలా చేశారు.

అత్యాచారం చేసిన నిందితులను రోడ్లపై తిప్పుతూ మహిళలతో కొట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.అత్యాచార నిందితులకు ఇలాంటి శిక్షలు వేసినప్పుడే.. బాధితులు తమను వేధించేవారిపై ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు, నిందితులు కూడా మరోసారి తప్పు చేయాలంటే భయపడతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలపై సామూహిక అత్యాచారాలు ఆగలేదు.అదేపనిగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవారికి, అత్యాచారాలు జరిపేవారికి గుణపాఠం కలిగేలా భోపాల్ పోలీసులు తీసుకున్న  ఈ నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసి భోపాల్ పోలీసులను శభాష్ అని మెచ్చుకోండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top