ఫేస్‌బుక్‌ లో అంతా ఫేక్ అకౌంట్లే.. రమ్య కూడా అలా చేస్తే ఫేక్ అకౌంట్స్ పెరగవా.?

ఫేస్‌బుక్‌.. నేటి త‌రుణంలో దీని గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా ఈ సామాజిక మాధ్య‌మం జ‌నాల్లోకి దూసుకువ‌చ్చింది. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు ఫేస్‌బుక్ ప్ర‌పంచంలో అంద‌రూ విహ‌రిస్తున్నారు. ఆయా సంద‌ర్భాల్లో తీసుకున్న ఫొటోలు, వీడియోల‌తోపాటు నెట్‌లో త‌మ‌కు క‌నిపించే ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను కూడా ఇందులో షేర్ చేసి లైక్‌లు, కామెంట్లు తెప్పించుకుంటున్నారు. అయితే ఇక్క‌డి వ‌రకు బాగానే ఉంది కానీ, ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌. అదీ.. న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్ల వ‌ల్లే.

2017 డిసెంబర్‌ చివరి నాటికి 2.13 బిలియన్ల నెలవారీ యాక్టివ్‌ వినియోగదార్లతో దూసుకు పోతోన్న ఫేస్‌బుక్‌కు నకిలీ అకౌంట్ల సమస్య కూడా అధికమేనని తేలింది. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ అంచనా ప్రకారం.. 2017 డిసెంబర్‌ చివరి నాటికి దాదాపు 200 మిలియన్‌ అకౌంట్లు(20 కోట్ల అకౌంట్లు) ఫేస్‌బుక్‌లో నకిలీవే ఉన్నాయట. అయితే చిత్రం ఏమిటంటే భారత్ లోనే ఎక్కువగా ఈ న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్న‌ట్టు తెలిసింది. దీంతోపాటు ఇండోనేషియా, వియ‌త్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లోనూ పుట్ట‌లు పుట్ట‌లుగా న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుత త‌రుణంలో కేవ‌లం ఫేస్‌బుక్ సాధార‌ణ యూజ‌ర్లే కాదు, రాజ‌కీయ నాయకులు, పొలిటిక‌ల్ పార్టీలు, సినిమా స్టార్లు, ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్ల‌ను వాడుతున్నార‌ట‌. ఇక మొన్న‌టికి మొన్న ప్ర‌ముఖ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు ర‌మ్య ఫేస్ బుక్ లో న‌కిలీ అకౌంట్లు ఉంటే త‌ప్పేంట‌ని బ‌హిరంగంగానే చెప్ప‌డం విశేషం. ఇక వారే ఇలా ఉన్న‌ప్పుడు సాధార‌ణ యూజ‌ర్లు ఫేక్ అకౌంట్ల‌ను ఎందుకు వాడ‌రు చెప్పండి. క‌చ్చితంగా వాడుతారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది అదే. అయితే నటి ర‌మ్య అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమో గానీ ఈ విష‌యం ర‌చ్చ రచ్చ అయింది. దీంతో చివ‌ర‌కు తాను ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని ఎవ‌రో కావాల‌ని ఈ వార్త‌ను వ్యాపింప చేశార‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది.

 

నిజానికి న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్ల‌తో అంత పెద్ద ప్రమాదం ఏమీ ఉండ‌ద‌ని న‌టి ర‌మ్య‌లా కొంద‌రు అంటున్న‌ప్ప‌టికీ అందులో వాస్త‌వం లేదు. ఎందుకంటే.. ఒక్కోసారి ఇలాంటి న‌కిలీ ఫేస్ బుక్ అకౌంట్లే కొంద‌రి కొంప‌లు ముంచుతాయి. మొన్న‌టికి మొన్న స‌చిన్ టెండుల్క‌ర్ కుమార్తెకు ఫేస్ బుక్‌లో అకౌంట్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తి ఆమె పేరిట ఆ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఆమెను ల‌వ్ చేస్తున్నానని చెప్పాడు. దీంతో అత‌న్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది యూజ‌ర్ల‌కు అస‌లు, న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు ఏవో తెలియ‌డం లేదు. దీంతో వారు అన‌వ‌స‌రంగా చిక్కుల్లో ప‌డుతున్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ముందు ముందు ఈ న‌కిలీ ఫేస్ బుక్ అకౌంట్ల వ‌ల్ల జ‌నాల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌వు..!

 

Comments

comments

Share this post

scroll to top