SHOCKING NEWS: హీరో రాజ్ తరుణ్ తండ్రి అరెస్ట్…! మూడేళ్ల జైలు శిక్ష ..! ఏం చేసాడో తెలుస్తే షాక్ అవుతారు.!

సినిమాల్లో అన్యాయం,అక్రమం జరిగితే రక్షించడానికి హీరోలుంటారు..ఆ హీరోలే నిజజీవితంలో అన్యాయాలు,అక్రమాలు చేస్తుంటే పరిస్థితి ఏంటి..ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు,హీరోియిన్లు,వారి వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక తప్పిదం చేసి,తత్ఫలితంగా శిక్ష అనుభవించారు..వారిలో తాజాగా రాజ్ తరుణ్ ఫాధర్ బసవరాజు కూడా చేరారు..నకిలి నగలు తాకట్టు పెట్టిన కేసులో బసవరాజుకి జైలు శిక్ష విదించారు.

ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో రాజ్ తరుణ్..కుమారి 21ఎఫ్,సినిమా చూపిస్త మామా,అందగాడు లాంటి మొదలైన సినిమాలతో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటివరకూ ఎలాంటి రిమార్క్ లేకుండా ముందుకు వెళ్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా తన తండ్రి జైలుశిక్ష వ్యవహారంతో వార్తల్లోకి వచ్చారు.వివరాల్లోకి వెళితే…. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టిన కేసులో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏప్రిల్ 20వ తేదీ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. వైజాగ్ లోని వేపగుంట ప్రాంతానికి చెందిన బసవరాజు,వయసు 53. సింహాచలం SBI బ్రాంచ్ లో 2013లో క్యాషియర్ గా ఉద్యోగం చేసేవారు. అప్పట్లోనే తన భార్య రాజ్యలక్ష్మి, పరిసర ప్రాంతాలకు చెందిన రాజు, ఎన్‌.సన్యాసి రాజు, కె.సాంబమూర్తి, ఎన్‌.వెంకట్రావు పేర్లపై నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.10 లక్షలను బంగారంపై అప్పుగా తీసుకున్నారు.

కొన్ని రోజులకు బ్యాంకు అధికారులు ఆడిట్‌ చేశారు. హీరో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు నకిలీవి అని తేలింది. దీనిపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఫైల్ అయ్యింది. కోర్టులో విచారణ జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ శుక్రవారం విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీపర్విన్‌ సుల్తానాబేగం తీర్పును వెల్లడించారు. హీరో రాజ్ తరుణ్ తండ్రి అయిన నిందితుడు నిడమర్తి బసవరాజుకు మూడేళ్ల  జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Comments

comments

Share this post

scroll to top