తరచూ గోళ్ళు కొరుక్కునే వారు..మిస్టర్ ఫర్ ఫెక్ట్ లట! డౌటుంటే ఈ సర్వే చూడండి.!

మీరు తరచుగా గోళ్ళను కొరుకుతూ ఉన్నారా? మీరు గోళ్ళను తరచూ కొరకడం వలన అందరూ మిమ్మల్ని తిడుతున్నారా?ఇప్పటికీ మీరు గోళ్ళు కొరికే అలవాటును మానుకోలేకపోతున్నారా?అయితే అలాంటి వారు ఏమి బాధపడక్కర్లేదు మరియు ఎవరైనా మిమ్మల్ని ఆ విషయంలో ఏమైనా అంటే పరిపూర్ణ వ్యక్తిత్వం కలవాణ్ణి. ఐ యామ్ మిష్టర్ పర్ఫెక్ట్ అని ధైర్యంగా చెప్పండి.

అవును, నేను చెప్పింది నిజమే, మీరు చదువుతున్నది అంతకుమించిన నిజం. ఇలా తరచూ గోళ్ళను కొరికే అలవాటు ఉన్నారు పరిపూర్ణ వంతులని పరిశోధకులు తాము చేసిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. ఇది నిజమా లేక ఎందుకు వీరు తరచూ ఇలా గోళ్ళను కొరుకుతున్నారని మొన్ట్రెల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కైరోన్ ఓకానర్, 48 మంది వ్యక్తులపై పరిశోధన చేయగా అందులో చాలామంది తరచూ గోళ్ళు కొరకడం, తల జుట్టును లాక్కోవడం, చర్మం లాగడం వంటివి చేసేవారు. వారందరిపై ఒత్తిడి,రిలాక్స్, బోరింగ్, నిరాశచెందడం, వంటి పరీక్షలు వారికి చేయగా విసుగు, నిరాశ కలిగినప్పుడు వారికి అలా చేయాలనిపించే కోరికలు పుడుతున్నాయి.
bitenails
ఇలా పరిశోధనల తర్వాత తెలిసినదేమిటంటే, చెడు అలవాటుగా వారు ఇలా చేయడం లేదని, వారంతా ప్రతి విషయంలోనూ ప్రజ్ఞత మరియు పరిణితి చెందినవారిని తెల్సింది. అందుకే ఇలా జుట్టు,గోళ్ళు కొరుకడం చేసేవారు కేవలం విసుగు కలిగినప్పు డు మాత్రమే చేస్తారట.
ఇక ఈ విషయమై పరిశోధనలు జరిపిన ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ… ‘అవును ఇది అందరూ నమ్మవలసిన నిజం. తరచూ గోళ్ళు కోరికే అలవాటు ఉన్న వారు ఎప్పుడూ పనిచేయడానికి ఇష్టపడతారు, రిలాక్స్ కావడానికి ఇష్టపడరు. ఏదైనా సమస్య కలిగినా ఆ సమస్యకు పరిష్కారం వెదకడానికే ఆ విధంగా చేస్తూ ఉంటారు. దానివల్ల నిరాశ మరియు విసుగు చెందరు. ఒకవేళ వీరు గనుక నిరాశ చెందడం, విసుగ్గా ఉండటం, బాధగా ఉంటే తమ లక్ష్యసాధనలో విఫలం అవుతారట. అందుకని వాళ్ళు ఈ విధంగా చేస్తూ తమ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారని’ ఆ ప్రొఫెసర్ అన్నాడు. ఇక ఇప్పటినుండి గోళ్ళు కొరుకుతున్నారని ఎవరైనా మిమ్మల్ని ఆటపట్టిస్తూ ఉంటే, ఐ యామ్ పర్ఫెక్ట్ అని రిప్లై ఇవ్వండి.
biting
వ్యక్తిత్వం పరంగా ఓకే కానీ హెల్త్ పరంగా మాత్రం ఇది అంత మంచి అలవాటైతే కాదు. గోర్లల్లో ఉండే మట్టి అదే పనిగా వాటిని కొరకడం వల్ల నోట్లోకి పొయ్యే ప్రమాదమూ ఉంది.!

Comments

comments

Share this post

scroll to top