న‌గ్నంగా నిద్రిస్తే ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

నిద్ర అనేది మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. రోజూ త‌గినంత నిద్ర పోతేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే.. అనారోగ్యాల బారిన పడాల్సి వ‌స్తుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. సాధార‌ణంగా ఎవ‌రైనా రాత్రి పూట నిద్రించేట‌ప్పుడు మ‌గ‌వారు అయితే షార్ట్స్‌, పైజామాలు, టీష‌ర్టులు, లోయర్స్ ధ‌రించి ప‌డుకుంటారు. ఇక ఆడ‌వారు అయితే నైటీలు, నైట్‌డ్రెస్‌లు వేసుకుని నిద్రిస్తారు. ఎందుకంటే రాత్రిపూట అవే డ్రెస్‌లు కంఫ‌ర్ట్‌గా ఉంటాయి. కానీ నిజానికి అస‌లు అవి కూడా లేకుండా.. అంటే.. న‌గ్నంగా నిద్రించాల‌ట తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు. వారు కొంత‌మందిపై చేసిన ప్ర‌యోగాల‌ను బ‌ట్టి ఈ విష‌యాన్ని మ‌న‌కు చెబుతున్నారు. రాత్రి పూట నైట్‌డ్రెస్‌ల లాంటివి కాకుండా ఒంటిపై ఏమీ లేకుండా న‌గ్నంగా నిద్రిస్తేనే మంచిద‌ట‌. అలా నిద్రిస్తే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నైట్‌డ్రెస్‌లు ధ‌రిస్తే రాత్రి పూట ప‌డుకున్న‌ప్పుడు అవి ఫోల్డ్ అయి మ‌నం బెడ్‌పై అటు ఇటు దొర్లేట‌ప్పుడు ఇబ్బందుల‌ను క‌లిగిస్తాయి. దీనికి తోడు ఒంటిపై డ్రెస్‌లు ఉంటే శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. అదే డ్రెస్ లేకుండా నిద్రిస్తే శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది. దీనికి తోడు దుస్తులు ఫోల్డ్ అవుతాయ‌న్న బెంగ ఉండ‌దు. వాటి ద్వారా అసౌక‌ర్యం కూడా క‌లిగే అవ‌కాశం ఉండ‌దు. క‌నుక హాయిగా నిద్ర‌ప‌డుతుంది. మైమ‌ర‌చి నిద్ర‌పోతారు. న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల్లో ఇదొక‌టి.

2. రాత్రిపూట న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంద‌ని అన్నాం క‌దా. ఈ క్ర‌మంలో శ‌రీరం త‌న సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌కి వ‌చ్చేందుకు అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంద‌ట‌. దీంతో శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతార‌ట‌. అంతేకాక రాత్రిపూట న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల కంగారు, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు రావ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

3. రోజు మొత్తం మ‌న శ‌రీరాన్ని దుస్తుల‌తో క‌ప్పి ఉంచుతాం క‌దా. దీంతో చ‌ర్మం రంధ్రాల‌కు స‌రిగ్గా గాలి సోక‌దు. అయితే రాత్రిపూట న‌గ్నంగా నిద్రిస్తే చ‌ర్మ రంధ్రాల‌కు త‌గినంత గాలి త‌గులుతుంది. దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మ క‌ణాలు ఎక్కువ‌గా నాశ‌నం కావు. ఫ‌లితంగా చర్మంపై అంత త్వ‌ర‌గా ముడ‌త‌లు రావు. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ క‌లుగుతుంది.

4. న‌గ్నంగా నిద్రిస్తే శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గి త‌ద్వారా వెంట్రుక‌లు కూడా చ‌ల్ల‌గా ఉంటాయి. ఫ‌లితంగా అవి దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. శిరోజాల స‌మ‌స్య‌లు ఉండ‌వు.

5. న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల స్త్రీ, పురుషుల్లో జ‌న‌నావ‌య‌వాల‌కు త‌గినంత గాలి ఆడుతుంది. ఫ‌లితంగా బాక్టీరియా పెరిగేందుకు అవ‌కాశం ఉండ‌దు. పురుషుల్లో వీర్యం ఉత్ప‌త్తి అవుతుంది. శుక్ర కణాలు నాశ‌నం కాకుండా యాక్టివ్‌గా ఉంటాయి.

6. న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల ఆడ‌, మ‌గ ఎవ‌రిలో అయినా ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఏదైనా అనుకుంటే సాధించేంత‌గా ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

7. ఆలుమ‌గ‌లు ఇద్ద‌రూ క‌ల‌సి న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల వారి శ‌రీరాలు ఒక‌దాంతో ఒక‌టి తాకుతూ ఉంటాయి. దీంతో వారిద్ద‌రిలోనూ ఆక్సిటోసిన్ అన‌బ‌డే ఫీల్ గుడ్ హార్మోన్ విడుద‌ల‌వుతుంద‌ట‌. ఇది దంప‌తులిద్ద‌రినీ హ్యాపీగా ఉండేలా చేస్తుంద‌ట‌. అందుక‌నే న‌గ్నంగా నిద్రించే దంప‌తులు ఎక్కువ రోజులు క‌ల‌సి ఉంటున్న‌ట్లు సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

8. న‌గ్నంగా నిద్రించ‌డం వ‌ల్ల లాభాలు ఉన్న‌ప్ప‌టికీ నిద్ర‌లో న‌డిచే అల‌వాటు ఉన్న‌వారు అలా చేయ‌రాదు. చేస్తే మొద‌టికే మోసం వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

9. చ‌ర్మం బ‌య‌ట‌కి ఎక్స్‌పోజ్ అయితే కొంద‌రికి ఎల‌ర్జీలు వ‌స్తుంటాయి. చ‌ర్మంపై బాక్టీరియా, వైర‌స్‌, ఇత‌ర పురుగులు వాలే అవ‌కాశం ఉంటుంది క‌నుక అలాంటి ఎల‌ర్జీల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక ఇలాంటి ఎల‌ర్జీలు ఉన్న‌వారు నగ్నంగా నిద్రించ‌రాదు.

10. త‌ర‌చూ జ‌లుబు, ద‌గ్గు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా న‌గ్నంగా నిద్రించ‌రాదు. ఎందుకంటే న‌గ్నంగా నిద్రించిన‌ప్పుడు శ‌రీర ఉష్ణోగ్ర‌త మ‌రింత త‌గ్గుతుంది క‌నుక‌, జ‌లుబు, ద‌గ్గు తీవ్ర‌త ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

11. చిన్న పిల్ల‌లు ఉంటే వారు త‌మ రూమ్‌లోకి వ‌స్తారేమో అని భ‌య‌ప‌డేవారు కొంద‌రుంటారు. అలాంటి వారు కూడా న‌గ్నంగా నిద్రించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

 

Comments

comments

Share this post

scroll to top