కేస్ విత్ డ్రా చేసుకోక‌పోతే న‌గ్న ఫొటోలు, వీడియోలు బ‌య‌ట పెడ‌తానన్నాడు ఆ రాక్ష‌సుడు.. షాకింగ్ ఘ‌ట‌న‌.

ప్రేమ పేరుతో అమ్మాయిల‌కు ద‌గ్గ‌ర‌వ‌డం.. ప్రేమించ‌డం.. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి శారీర‌కంగా లొంగ దీసుకోవ‌డం.. పెళ్లి మాట ఎత్తితే వేధింపుల‌కు పాల్ప‌డ‌డం.. బెదిరించ‌డం.. అవ‌స‌రం అయితే దాడి చేయ‌డం, చంప‌డం.. ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు మృగాళ్లు అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తి ఇది. అయిన‌ప్ప‌టికీ అమ్మాయిలు ఆ మృగాళ్ల బారిన ప‌డుతున్నారు. త‌రువాత ప‌శ్చాత్తాపానికి లోన‌వుతున్నారు. హైద‌రాబాద్‌లో స‌రిగ్గా ఇలాగే ఓ యువ‌తి ఓ మృగాడి బారిన ప‌డింది. చివ‌ర‌కు ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

మాదాపూర్ లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న ఓ యువ‌తి (25) స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఆసిఫ్ న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన మ‌హ‌మ్మ‌ద్ మ‌హ‌బూబ్ ష‌రీఫ్ (30) అనే వ్యక్తితో ఏడాది క్రితం ప‌రిచ‌యం అయింది. అనంత‌రం ఆ ప‌రిచ‌యం ప్రేమగా మారింది. ఈ క్ర‌మంలో ష‌రీఫ్ ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో వారిద్ద‌రూ శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో ఇద్ద‌రూ కొంత కాలం పాటు స‌హ‌జీనం కూడా చేశారు. అయితే ఆ యువ‌తి ష‌రీఫ్ ఎదుట పెళ్లి ప్ర‌స్తావ‌న తెచ్చింది. దీంతో ష‌రీఫ్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు స‌సేమిరా అన్నాడు. అత‌ను పెళ్లికి నిరాక‌రించ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితురాలు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ష‌రీఫ్‌పై కేసు న‌మోదు చేశారు.

పోలీసుల‌కు ఆ యువ‌తి ఫిర్యాదు చేయ‌డంతో ష‌రీఫ్ మ‌రింత రెచ్చిపోయాడు. ఆమెను త‌ర‌చూ శారీర‌కంగా, మాన‌సికంగా వేధించ‌డం మొద‌లు పెట్టాడు. ఆమె నుంచి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు, బంగారం కూడా తీసుకున్నాడు. అనంతరం కేస్ విత్ డ్రా చేసుకోక‌పోతే ఆ యువ‌తికి చెందిన న‌గ్న ఫొటోలు, వీడియోలు నెట్‌లో, యూట్యూబ్‌లో పెడ‌తాన‌ని బెదిరించాడు. అలా జ‌రిగే స‌రికి ఆ యువ‌తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ నెల 24వ తేదీన‌ అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.45లోని ఓ పబ్ వద్దకు రావాలని పిలిచిన ష‌రీఫ్‌ తీరా ఆమె అక్కడికి వచ్చాక మరోసారికి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అత‌ని బారి నుంచి త‌ప్పించుకున్న‌ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నీచుల‌ను అస్స‌లు విడిచిపెట్ట‌రాదు. క‌ఠినంగా శిక్షించాలి.

 

Comments

comments

Share this post

scroll to top