“అఖిల్ – శ్రియ” పెళ్లి పై స్పందించిన “నాగార్జున” షాకింగ్ కామెంట్స్..! ఏమన్నారో తెలుసా..?

అఖిల్ – శ్రియ పెళ్లి కాన్సల్… అక్కినేని కుటుంబంకి పెద్ద షాక్..రెండు నెలల ముందు మీడియా లో సంచలనం సృష్టించిన వార్త ఇది. ఒకపక్క అక్కినేని వారసుల నిశ్చితార్తం ఘనంగా జరిగింది అని మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంతలో అఖిల్ పెళ్లి రద్దైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇటలీ లో జరగనున్న పెళ్లికోసం బుక్ చేసిన ఫ్లైట్ టిక్కెట్లు కాన్సల్ చేయడం, ఎయిర్ పోర్ట్ లో ఏదో గొడవ జరిగింది అనే వార్తలు బయటకి వచ్చాయి. కానీ దీనిపై అధికారికంగా నాగార్జున మీడియా కు తెలపలేదు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు అని అనుకుంటూనే ఉన్నాము అంతలో శ్రియ ఒక ఎన్.ఆర్.ఐ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు షాక్ ఇచ్చింది..!

ఇంతలో అల్లు శిరీష్ తో పార్టీ లో “శ్రియ” ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు అక్కినేని కుటుంబంలోని ఎవరు “అఖిల్ – శ్రియ” పెళ్లి కాన్సుల్ అయిన విషయంపై స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నా…అక్కినేని నాగార్జున గారు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. మొట్టమొదటి సారి ఇటీవలే నాగార్జున గారు ఈ విషయం గురించి మాట్లాడారని సినీ  పరిశ్రమలో టాక్. తాజా సమాచారం ప్రకారం నాగార్జున గారు “అఖిల్ – శ్రియ” ల పెళ్లి డేట్ మాత్రమే కాన్సల్ అయ్యింది. పెళ్లి కాన్సల్ అవ్వలేదు. వారిద్దరి మధ్య చిన్న విభేదాలు రావడం వల్ల ఇలా జరిగింది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మకండి. వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయి. త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

మొత్తానికి వారిద్దరి పెళ్లి వాయిదా పడిందని…వారిద్దరి మధ్య అపోహలు తొలగిపోగానే పెళ్లి అని నాగార్జున గారు చెప్పినట్టు టాక్. మరి అది ఎంత వరకు నిజమో..? వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగేది ఎప్పుడు? పెళ్లి జరిగేది ఇంకెప్పుడు? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు!

Comments

comments

Share this post

scroll to top