ఓటేసిన హీరోలు..వేలికి సిరా గుర్తుతో సెల్ఫీలు!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో  తమ ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకుడ్ని ఎన్నుకోవలసిందిగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అన్నారు.  ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా గుర్తుతో దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఓటుహక్కును వినియోగించుకున్న ప్రముఖులు:
అక్కినేని నాగార్జున:
అక్కినేని నాగార్జున, అమల దంపతులు జూబ్లీహిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ఆనందంగా ఉందని, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నాగార్జున అన్నాడు.
nag
అల్లుఅర్జున్:
జుబ్లీహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ” ఓటును వినియోగించుకోండి, మీ ఓటును వినియోగించుకోకపోతే ప్రశ్నించే హక్కు, ఫిర్యాదులు చేయలేరు” అని సోషల్ మీడియాలో తన ఓటును సిరా గుర్తును చూపిస్తూ ఈ విధంగా తెలిపాడు.
allu
బాలకృష్ణ:
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ జుబ్లీహిల్స్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం అందరూ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
bal
జూఎన్టీఆర్:
జుబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి  ఓటు హక్కును వినియోగించుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఓటింగ్ పై ప్రజలలో అవగాహన పెరుగుతోందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని, క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ ఉండాలను ఎన్టీఆర్ ఆకాంక్షించాడు.
ntr
మంచు మనోజ్:
మంచు మనోజ్ మరియు మంచు లక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకొని, అనంతరం ఒక సెల్ఫీ దిగి ఓటుహక్కును అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
manchu

Comments

comments

Share this post

scroll to top