సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? ఇప్పుడు తెలుగు లో ఒక టాప్ హీరో..! ఎవరో చూడండి.!

నాగార్జున నటించిన మొదటి సినిమా ఏది అంటే విక్రమ్ అని టక్కున సమాధానం చెప్తాం..కాని నాగార్జున బాల నటుడుగా యాక్ట్ చేసారని ఎవరికి తెలీదు…కాని నాగర్జున బాలనటుడిగా సావిత్రి గారితో నటించాడు తెలుసా..సావిత్రి తో నాగ్ ఉన్న ఫోటో ఇప్పుడు   ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.మహానటి సావిత్రితో తన చిన్ననాటి ఫోటో చూసుకుని నాగార్జున సంతోషిస్తున్నారు..ఇంతకీ ఈ ఫోటో ఇప్పుడు బయటికెందుకు వచ్చింది.నాగార్జున ఏ సినిమాలో బాలనటుడిగా నటించారో తెలుసా..?

త్వరలో మహానటి సావిత్రి  జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి  మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సావిత్రికి సంబంధించిన పలు పాత ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిలో ఈ ఫొటో హాట్ టాపిక్‌గా మారింది. వెలుగు నీడలు సినిమాలో సావిత్రి ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోని ట్విటర్లో షేర్ చేసారు నాగార్జున అభిమాని గౌతమ్ . ఫొటోతొ పాటు ‘నాగార్జున గారు సావిత్రిగారితో మీరు కలిసి నటించారు’ అంటూ కామెంట్ చేశాడు.  అలనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్‌ అంటూ రిప్లై కామెంట్ పెట్టారు నాగార్జున.ఇప్పటివరకు అందరూ 1986లో వచ్చిన విక్రమ్ నాగార్జున మొదటి సినిమా అనుకుంటున్నారు..ఈ ఫోటో చూసిన నాగార్జున అభిమానులు షాక్ తో కూడిన ఆనందంలో ఉన్నారు..

Comments

comments

Share this post

scroll to top