గాజు గ్లాసు పగులగొట్టాలని చూస్తే పీకలు కోస్తుంది: మెగా బ్రదర్ నాగబాబు..

నా ఛానల్ నా ఇష్టం పేరుతో యూట్యూబ్ లో ఛానల్ ప్రారంభించిన నాగబాబు ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మొదట్లో ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన నాగబాబు ఆ తర్వాత లోకేష్ మాట్లాడిన మాటలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కాంట్రవర్షియల్ కామంట్స్ చేసారు. తాజాగా ఏపీ రాజకీయాలపై వ్యంగ్యంగా తనదైన శైలిలో మరో వీడియోను రిలీజ్ చేసారు.


ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ…. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో అడాల్ప్ హిట్లర్ అనే ఒక నరరూప రాక్షసుడు ఉండేవాడు. అతడికి కొన్ని ప్రచార సాధనాలు ఉండేవి . వాటి ద్వారా తన పార్టీ గురించి ఎక్కడలేని బిల్డప్పులు ఇచ్చుకునేవాడు. దానికి ప్రధాన సూత్రధారి అతడి ప్రచార శాఖకు సంబంధించిన మినిస్టర్ గోబెల్స్ ని నియమించుకునే వాడు.. ఆ రోజుల్లో జనాలు ఏంటంటే.. ఆ గోబెల్స్ ప్రచారానికి ప్రభావితం అయ్యేవారు. కారణం ఏంటంటే ఆ కాలంలో సోషల్ మీడియా లేదు కాబట్టి వారి మాటలకు జనాలు ఆకర్షితులు అయ్యే వారు. ప్రస్తుతం ఇలాంటి ప్రచారమే మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది.ఈ రకంగా గోబెల్స్ గాళ్లు చాలా మంది తయారయ్యారు.
ఉదాహరణకు వాళ్లు జనసేనను తొక్కేయాలని, జనసైనికులను మానసికంగా కృంగదీయాలని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు జనసేన వైసీపీతో కలిసిపోయిందని ……. వైసీపీ వాళ్లు టీడీపీతో కలిసిపోయిందని అంటున్నారు. మధ్యలో బీజేపీతో కలిసిందని కూడా అంటున్నారు. కళ్యాణ్ బాబు అంత ఓపెన్‌గా చెప్పినా కొంచెం కూడా సెన్స్ లేదా…? కళ్యాణ్ బాబు మీ లాగా కన్వెన్షనల్, క్రిమినల్, ఫ్యాక్షన్, , లిక్కర్ మాఫియాలు,ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా చేసే వ్యక్తి కాదు, జెన్యున్ గా రాజకీయాలు చేయాలనీ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని.
అలాంటి వ్యక్తి మీద ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా కుదరదు. ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంది. సాక్షి పేపర్‌లో రాశారు. పవన్ సర్దుబాట్లు చేసుకుంటున్నారు అని.. రేపు ఇంకొకరు రాస్తారు. అంతకు ముందు చంద్రబాబు కూడా ఇదే కామెంట్స్ చేశారు. కామన్ సెన్స్ లేకుండా వార్త ఎలా రాస్తారు. ఒకవేళ రాస్తే. కొంచెం బెటర్‌గా రాయొచ్చు కదా. మరీ 25 సీట్లకి, 3 ఎంపీ సీట్లకు ఎలా అమ్ముడు పోతాడు. తనకి సీట్లే కావలి అనుకుంటే 2014లోనే తీసుకునేవాడు కదా.. ఆ ఎన్నికల సమయంలో మంచి వాడు చెడ్డవాడు అనే ఆప్షన్ లేదు. కేవలం చెడ్డ వాడు, అంతకన్నా బాగా చెడ్డవాడు అనే ఆప్షన్స్ మాత్రమే ఉండటంతో చంద్రబాబుకి సపోర్ట్ చేశారు.
మీరు జనసేనని ఎంత తొక్కాలని చూసినా.. సోషల్ మీడియా వేదిక దొరికింది. మీరు ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా.. ఎంత నీచానికి దిగజారినా జనం గుండెల్లో ఉన్న జనసేన, పవన్ కళ్యాణ్‌ను ఏం చేయలేరు. గాజు గ్లాసు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దాహం వేస్తే అందులో నీరు పోసుకుని దాహం తీర్చుకోవచ్చు. అదే దాని ధర్మం. దాని లక్షణం ఏంటి అంటే తన, మన, పర, మంచి వాడు, చెడ్డవాడు అనే బేధం చూపించదు. ఇతడు ప్రతి పక్షం, అధికార పక్షం అనే ఆలోచన దానికి ఉండదు. అందరి దాహాన్ని చక్కగా తీరుస్తుంది. అందరికీ ఉపయోగపడుతుంది. ఒక వేళ మీరు గ్లాసుని పగలగొట్టాలని చూసినా.. ఒకవేళ గ్లాసు పగిలినా.. ఆ గ్లాసు గాజులో ఒక్కో పెంకు ఆయుధంగా మారి పీకలు కోసే అవకాశం కూడా ఉంది. బీ కేర్ ఫుల్… ఈ రకంగా మరో మారు ఏపీ పాలిటిక్స్ పై తనదైన గళాన్ని వినిపించారు మెగాబ్రదర్ నాగబాబు.

Comments

comments

Share this post

scroll to top