పొట్టి డ్రెస్సు వేసుకుంటే క్యారెక్టర్ లేనట్టా.? అందుకే అంత సీరియస్ గా స్పందించా – నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా లో బాగా హల్చల్ చేస్తున్నారు, బాలకృష్ణ ఎవరో తెలీదు అనే విషయం నుండి మొదలెట్టిన ఆయన, బాలసుబ్రమణ్యం వరకు వెళ్లారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ సీరియస్ గా స్పందించడానికి గల కారణాలు తెలిపాడు.

తప్పేంటి అసలు.. :

‘ఆడవాళ్లు పొట్టి దుస్తులు ధరిస్తే తప్పేంటి, మన చట్ట ప్రకారం ఆడవాళ్ళూ నగ్నం గా తిరిగితేనే తప్పు, పొట్టి దుస్తులు వేసుకుంటే తప్పు కాదు, ఆడవాళ్ళూ ఎటువంటి బట్టలు వేసుకోవాలో వేసుకోకూడదు చెప్పడానికి మనమెవరం. మగవాళ్ళు ఆడదాన్ని అణగతొక్కడానికి చూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, పొట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళయిపోతారా’ అని నాగబాబు మండిపడ్డాడు.

ఎవ్వరిని వదలలేదు.. :

ఇటీవల కాలం లో ఆడవాళ్ళ వస్త్రధారణ పైన కామెంట్స్ చేసిన బాలసుబ్రమణ్యం గారు, మురళి మోహన్ గారు, గరికపాటి గురించి కూడా నాగబాబు మాట్లాడాడు. ఓ హీరోయిన్ కాస్త ఎక్స్‌పోజింగ్ చేస్తూ డ్రెస్ వేసుకుంటే ఆ మాత్రం దానికే ఆమె ప్రొడ్యూసర్లు, హీరోలను ట్రాప్ చేసేస్తుందని ఎలా అంటారు. వాళ్లకి అడవాళ్లంటే అసలు గౌరవం ఉందా? ఫంక్షన్లకు హీరోయిన్లేమైనా బట్టలిప్పుకుని వస్తున్నారా.? హీరోయిన్ల గురించి మాట్లాడేందుకు వాళ్లకేం అర్హత ఉంది?. పొట్టి దుస్తులు వేసుకుంటే వాళ్లకి క్యారెక్టర్ లేనట్లా.? వాళ్లు సెలబ్రెటీలుగా ఆడవాళ్లపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే నేనూ సెలబ్రెటీగా సమాధానం ఇచ్చాను. ఆడవాళ్ల డ్రెస్సింగ్‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు.

నా బాధ్యత.. :

‘ మన సమాజంలో మగ, ఆడ ఇద్దరికీ సమానహక్కులు, గౌరవం ఉండాలన్నదే నా అభిప్రాయం. నేను ఓ మహిళకు బిడ్డను, ఓ మహిళకు భర్తని, ఓ ఆడపిల్లకి తండ్రిని, నాకు పరిచయం ఉన్న ఎందరో ఆడవాళ్లని ఆడపడుచులుగా భావిస్తుంటా. పెద్దవాళ్ళు అమితాబ్ గారిని చూసి నేర్చుకోవాలి, ఆయన ఎంతో బాగా మాట్లాడతారు ఆడవాళ్ళ గురించి, వాళ్లకు ఎంతగానో మర్యాద ఇస్తారు, సమాజం లో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడారు కాబట్టే నేను సీరియస్ అవ్వాల్సి వచ్చింది, మన దేశం లో ఆడవాళ్లకు గౌరవం లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళని అణగదొక్కాలనే చూస్తారు,’ అని నాగబాబు ఇంటర్వ్యూ లో తెలిపారు.

పృథ్వి పైన కూడా.. :

బైటి వారి నుంచి వచ్చిన డబ్బుని వరుణ్ తేజ్, నాగబాబు జనసేన పార్టీ కి ఫండ్ గా ఇచ్చారు అని యాక్టర్ పృథ్వి కామెంట్ చెయ్యడం తో నాగబాబు ఫైర్ అయ్యారు. ‘బ్యాంకు నుండి డ్రా చేసి ఇచ్చాము అండి, అవి ప్యూర్ వైట్ మనీ, ఇన్కమ్ టాక్స్ కూడా కట్టాము ఆ డబ్బు కి, కావాలంటే బ్యాంకు స్టేట్మెంట్స్ చెక్ చేసుకోండి. పృథ్వి నాకు కాల్ రేపు చేయి నేను నీకే చెప్తా, నా నెంబర్ నీ దెగ్గర ఉంది కదా, కాల్ చేయి రేపు’ అని నాగబాబు ఇంటర్వ్యూ లో ఫైర్ అయ్యారు.

 

Comments

comments

Share this post

scroll to top