మర్యాదగా చెప్తున్నా… మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి!!

నెల క్రితం ఒక ఇంటర్వ్యూ లో బాలయ్య ఎవరో తెలీదని చెప్పారు నాగబాబు, ఆ రోజు మొదలైన రచ్చ ఇంకా ఆగలేదు, మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ఒకరినొకరు సోషల్ మీడియా లో దూషించుకోడం ఎక్కువైంది. ఆ తరువాత ప్రతి రెండు మూడు రోజులకు నాగబాబు ఏదో ఒక రకంగా రియాక్ట్ అవుతూనే ఉన్నాడు బాలకృష్ణ పైన, మొన్ననే బాల కృష్ణ పైన ఇండైరెక్ట్ గా ఒక స్మాల్ వీడియో ని యూట్యూబ్ లో వదిలాడు, మా అన్నదమ్ముల మీద బాలకృష్ణ ఆరుసార్లు అభ్యంతకర కామెంట్స్ చేసాడు అంటూ ఒక్కో కామెంట్ కి ఒక్కో రిప్లై వీడియో పెట్టాడు నాగబాబు, చివరిగా 6 వ కామెంట్ కి పెట్టిన వీడియో లో ఇకపైన అయిన నోరు అదుపులో పెట్టుకోవాలని బాలకృష్ణ కి సూచించారు.

6 వ కామెంట్ కి నాగబాబు ఇచ్చిన రిప్లై :

ఏడేళ్ల క్రితం చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. నాగబాబు మాట్లాడుతూ : “2012 జనవరిలో బాలకృష్ణగారు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా పని చేయడు అని కామెంట్ చేశారు. అపుడు చాలా కోపం, ఆవేదన కలిగింది. నేను రియాక్ట్ అవుదామా అనుకునే లోపు, మీడియాలో బాలకృష్ణ చిన్నపిల్లాడు, అతడేం మాట్లాతతాడో తెలియదు అని పెద్దరికంగా అన్నయ్య సమాధానం ఇచ్చారు. అందు వల్ల మేమ మాట్లాడలేక ఆవేశాన్ని, కోపాన్ని చంపుకుని కూర్చున్నాము. మీ నాన్నగారు మీకు గొప్పే కావచ్చు.

ఏ కొడుక్కుకైనా తండ్రి గొప్పే. మీ నాన్నగారి గొప్పదనాన్ని కీర్తించుకోవడంలో తప్పులేదు. కానీ మీ నాన్నగారి కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోరు అని మాట్లాడటం సరికాదు. ఇదే మాట నేను చిరంజీవి కాలిగోటికి బాలకృష్ణ సరిపోరు అంటే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్, మీ ఇంట్లో వారికి, మీ పార్టీ వారికి ఎలా ఉంటుంది. ఎంత అహంకారం ఉంటే మీరు ఆ మాట అంటారు? మాకు చేతకాక కాదు. మా తల్లిదండ్రులు అలా పెంచలేదు. సార్ నోరు అదుపులో పెట్టుకోండి సార్ మీకు మర్యాదగా చెబుతున్నాను.

దయచేసి మాట్లాడేపుడు నోరు అదుపులో పెట్టుకని మాట్లాడండి. మీరు విమర్శలు వంద చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ ఎవరికీ ఎవరు భయపడే వ్యక్తులు లేరు. కేవలం సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం. దీన్ని మీరు ఆపుతారని ఆశిస్తున్నాను. మీతో శతృత్వంకానీ, గొడవలు కానీ లేవు. మా అన్నయ్యను, తమ్మున్ని వ్యక్తిగతంగా అంటే తప్పకుండా రియాక్ట్ అవుతాం. రాజకీయంగా మీరు ఎదుర్కోండి, వంద అనండి. కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు.

మా అన్నయ్య మాకు తండ్రితో సమానం. ఎన్టీ రామారావు మీకు గొప్ప అయుండొచ్చు, మా అన్నయ్య మాకు చాలా గొప్ప, ఆయన వ్యక్తిత్వం గొప్పది. మా మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అన్నదమ్ములుగా మేము కలిసుంటాం. కొట్టుకునే అన్నదమ్ములం కాదు. ఫ్యాన్స్ కూడా ఇష్యూ చేయొద్దు మెగా అభిమానులు కూడా దీనిపై ఎలాంటి ఇష్యూ చేయొద్దు. ఎవరి అభిమానులైనా అందరితో కలిసి ఉందాం. నాకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. అలాంటి అకౌంట్స్ ద్వారా ఏమైనా పోస్టులు వస్తే నమ్మొద్దు. ఫేస్ బుక్ అకౌంట్ మాత్రమే వాడుతున్నాను.

మరికొందరు ఓ ప్రశ్న అడిగారు. ఇంతకాలం తర్వాత నాగబాబు రియాక్ట్ అయ్యారేంటి? దీని వెనక ఏమైనా పొలిటికల్ రీజన్ ఉందా? అంటున్నారు. వంద శాతం దీని వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవు. రియాక్ట్ అవ్వడానికి టైమ్ ఏమిటి? మాకు కల్చర్ ఉంది కాబట్టి ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వము. భరిస్తాం, భరితస్తాం.. ఇపుడు ఒళ్లు మండి ఇలా మాట్లాడుతున్నాం. అయినా రియాక్ట్ అవ్వడానికి టైమ్ ఏమిటి? నేను ఇప్పుడు రియాక్ట్ అవుతాను. ఒక ఆరు నెలలు, సంవత్సరం తర్వాత రియాక్ట్ అవుతాను.. అదేమైనా తప్పా? మన ఇంట్లో ఒకడు దొంగతనం చేసి పారిపోయాడు. సంవత్సరం తర్వాత కనపడ్డాడు. ఊరుకుంటామా? మనల్ని ఎవరైనా కొట్టి పారిపోతే సంవత్సరం తర్వాత కనిపిపడితే వదిలేస్తామా”? అని నాగబాబు వీడియో లో పేర్కొన్నారు..

 

Comments

comments

Share this post

scroll to top