కూతురి విషయం లో సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు !!

టవర్ స్టార్, మెగా బ్రదర్, అండ్ రీసెంట్ గా వచ్చిన ట్యాగ్ కాంట్రవర్సీ స్టార్.. ఏ పేరుతో పిలిచినా పలికే నవ్వుతు ఉండే రారాజు నాగబాబు, గత కొంతకాలంగా సోషల్ మీడియా లోను మీడియా లోను హంగామా సృష్టిస్తున్నాడు, జనసేన పార్టీ కి ఇండైరెక్ట్ ప్రొమోషన్స్ కత పక్కన పెడితే, కొత్త శత్రువులను తీసుకొస్తున్నాడు నాగబాబు, సోషల్ మీడియా లో నాగబాబు పెడుతున్న పోస్ట్స్ కి వీడియోస్ కి జనసేన మీద విమర్శలు చేసే వారి సంఖ్య పెరిగేలాగే ఉంది.

కూతురి గురించి… :

నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి నాగబాబు మాట్లాడుతూ : ‘నా కూతురికి 2018 లోనే వివాహం చేస్తా అని తనతో చెప్పా, అందుకు తను కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ డెడ్ లైన్ దాటిపోయింది, ఈ సంవత్సరం లో తనకి ఖచ్చితంగా పెళ్లి చేస్తా, బయట వారినే చూస్తున్న, ఒకటే కులమా కాదా అన్నది చూడట్లేదు, అమ్మాయిని బాగా చూసుకునేవాడు అయితే చాలు, ఈ సంవత్సరం లో ఖచ్చితంగా తనకు పెళ్లి చేసేస్తా’ అని అంటున్నాడు నాగబాబు.

సినిమాల్లో.. :

ప్రస్తుతం నిహారిక సినిమాల్తో, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ గా గడిపేస్తుంది. ఢీ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసిన నిహారిక, నటన మీద ఇంటరెస్ట్ తో సినిమాల్లోకి వెళ్ళింది, వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయి, ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ సినిమాల్లో అనుకున్నంత స్థాయికి వెళ్లలేకపోయింది, సరైన సక్సెస్ ఇంత వరకు దక్కలేదు ఈ అమ్మడుకి. వరుణ్ తేజ్ నిర్మాతగా నిహారిక మెయిన్ లీడ్ గా సూర్యకాంతం సినిమా లో నటించింది, సొంత అన్నయ్య నే సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం, సినిమా టీజర్ జనాలని ఆకట్టుకోవడం తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది, ఈ సినిమా అయినా నిహారిక కు మంచి బ్రేక్ ఇస్తుందని అభిమానులు ఆశ తో ఉన్నారు. నిహారిక కి నటన మీద ఇష్టం ఉందని హీరోయిన్ గా నటిస్తా అంటే ఒప్పుకున్నా అని నాగబాబు పలు సందర్భాల్లో తెలిపాడు.

 

Comments

comments

Share this post

scroll to top