“యుద్ధం శరణం”తో “నాగ చైతన్య” హిట్ కొట్టాడా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): యుద్ధం శరణం (Yuddam Sharanam)

Cast & Crew:

 • నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు
 • సంగీతం: వివేక్ సాగర్
 • నిర్మాత: రజనీ కొర్రపాటి (వారాహి చలనచిత్రం)
 • దర్శకత్వం: కృష్ణ మరిముత్తు

Story:

ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడిగా చైతూ కనిస్తాడు. ఉద్యోగం పక్కనపెట్టి లాంగ్ డిస్టెన్స్ డ్రోన్స్ తయారుచేసే పనిలో పడతాడు. దాని మూలంగానే కొన్ని సమస్యలు వచ్చిపడతాయి. చైతూ తయారుచేసిన డ్రోన్ ద్వారా డాన్ నాయక్ (శ్రీకాంత్)కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో నాయక్.. చైతూని టార్గెట్ చేస్తాడు. అతని ఫ్యామిలీని బంధిస్తాడు. నాయక్‌తో యుద్ధం చేసి కుటుంబాన్ని ఎలా కాపాడాడన్నదే సినిమా.

Review:

మొత్తం స్క్రీన్‌ప్లే మీదే సినిమాను నడిపించాడు దర్శకుడు. కథ పాతదే అయినప్పటికీ దానికి కొన్ని కొత్త హంగులు అద్దాడు. ఇక లావణ్య త్రిపాఠి తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందని ప్రేక్షకులు అంటున్నారు. చైతూ, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట. శ్రీకాంత్ లుక్, నటన సినిమాకు మరో హైలైట్ అట, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ, రవివర్మ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారట. ప్రియదర్శి పుల్లికొండ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడట. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని, వివేక్ సాగర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా మరో ప్లస్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందట.

Plus Points:

 • స్క్రీన్ ప్లే
 • చైతన్య లావణ్య కెమిస్ట్రీ
 • శ్రీకాంత్ లుక్
 • రావు రమేష్,ప్రియదర్శి పెర్ఫార్మన్స్
 • నిర్మాణ విలువలు
 • ప్రియదర్శి కామెడీ
 • సంగీతం
 • సినిమాటోగ్రఫీ

Minus Points:

 • అవేరేజ్ ఫస్ట్ హాఫ్
 • రొటీన్ స్టోరీ

Final Verdict:

పాత కథే…కానీ కొత్తగా చిత్రీకరించారు.

AP2TG Rating: 3 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top