“నాగ చైతన్య – సమంత” హనీమూన్ కి ఎక్కడికి వెళ్లారో తెలుసా..? సామ్ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవే..!

ఈ నెల 6,7 తేదీలలో ఇటు హిందూ అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న సమంత- నాగ చైతన్య జంట ప్రస్తుతం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తుంది. పెళ్ళి తర్వాత సమంత తాను నటించిన రాజు గారి గది సినిమా ప్రమోషన్ లో పాల్గొని, ఆ తర్వాత మహానటి చిత్రంలో కొన్ని సీన్స్ కూడా చేసిందని టాక్. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫోటోలని బట్టి చూస్తుంటే చైతూ-సామ్ ల జంట హనీమూన్ కోసం లండన్ వెళ్ళారని సమాచారం. అక్కడి బ్రిటీష్‌ మ్యూజియంకి వెళ్ళి శిల్ప సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆ పక్కనే ఉన్న హోటల్ లో లంచ్ చేసి అక్కడి నుండి పక్కనే ఉన్న గుక్కి అనే బ్రాండ్ స్టోర్ కి కూడా వెళ్లారని తెలుస్తోంది. అయితే చైతూ కాఫీ తాగుతున్న వీడియోని సమంత తన స్నేహితులకి షేర్ చేయడంతో ఈ విషయం బయటకి వచ్చిందని చెబుతున్నారు. ఇక లండన్ తరువాత ఈ జంట స్కాట్ ల్యాండ్ మరియు బెల్ ఫాస్ట్ కూడా చుట్టేస్తారని ప్రచారం జరుగుతోంది.

View this post on Instagram

❤️❤️❤️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Comments

comments

Share this post

scroll to top