నాగ చైతన్య తల్లి “లక్ష్మి” రెండో భర్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? నాగార్జున కు విడాకులిచ్చిన తర్వాత…

టాలీవుడ్ జంట “సమంత – నాగ చైతన్య” ల వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అక్టోబర్ 6, 7న గోవా లో పెళ్లి జరగబోతుందని పెళ్లి కార్డు లో పేర్కొన్నారు. అలాగే ఈ పెళ్లి కార్డులో ఓ ప్రత్యేకమైన విషయం ఉంది. నాగ చైతన్య తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మి. వీళ్ళిద్దరూ విడిపోయి వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున అమలను చేసుకుంటే లక్ష్మియేమో శరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది.

అయితే ఈ కార్డు చూసినప్పటి నుండి చాలా మందికి శరత్ ఎవరో తెలుసుకోవాలని అనిపించే ఉంటది. అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చైతూ… ఒక ఛానెల్‌కి ఇస్తున్న ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు.తనకి తన అమ్మ అంటే ఎంతో భయమని, కానీ ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పిన నాగచైతన్య, తన తల్లి ఏ లోటు లేకుండా తనకి అన్ని సమకూర్చారని అన్నారు. అయితే తన తల్లి గురించి ఇంకా మాట్లాడుతూ ”అమ్మకి అన్ని విషయాలు చెప్పే నేను నా ప్రేమ విషయం గురించి చెప్పడానికి మొదట భయపడ్డానని అయితే మాటల మధ్యలో ఒకసారి చెప్పానని దానికి అమ్మ ఒప్పుకుందని” నాగచైతన్య అన్నారు.నా జీవితంలో అమ్మ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు తనకి అమ్మ అన్ని విధాలుగా సహాయంగా ఉన్నారని చైతూ వెల్లడించాడు. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేనని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.

ఇప్పుడు అసలు కథలోకి వెళితే…రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరి అయిన “లక్ష్మి” అమెరికా లో చదువుకునే సమయంలో నాగార్జున తో ప్రేమలో పడింది అంట. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరిగింది. వీరికి నాగ చైతన్య జన్మించాడు. 18 ఏళ్ల వరకు చెన్నై లో నాగ చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. తరవాత కొన్ని కారణాల వల్ల నాగార్జున కు డివోర్స్ ఇచ్చింది. నాగార్జున అమల పెళ్లి చేసుకున్నారు. చెన్నై లోనే నివసిస్తూ. శరత్ విజయ్ రాఘవన్ ను పెళ్లి చేసుకుంది. ఆయన వయసులో లక్ష్మి కంటే చాలా పెద్దగా కనిపిస్తాడు.

సుందరం మోటార్స్ డివిజన్ సంస్థలో భాగమైన టీ.వీ. సుందరం , అయ్యేంగర్ అండ్ సన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. గ్రేట్ ఇండియా సంస్థలో మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసారు. 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకీ. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసారు.

 

 

 

Comments

comments

Share this post

scroll to top