రేపు విడుదల కానున్న నాగార్జున తనయుడు అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నాంటూ కర్నూల్ లోని ఆనం థియేటర్ వద్ద నాగార్జున ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఇద్దరు అభిమానులు మాత్రం ఏకంగా తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిద్దరిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అభిమానం అభిమానం గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది , అది పిచ్చి గా మారితేనే అసలు బాగోదు. టికెట్లను అధిక ధరకు అమ్ముతున్నారని ఆందోళన చేయడంలో అర్థం ఉంది కానీ…. కిరోసిన్ ఒంటి మీద పోసుకొని ఆహుతి అవుదామనుకున్న వారి ఆలోచనల్లో మాత్రవ వెర్రితనం కనిపిస్తుంది.