“మహానటి” సినిమాలో పెద్ద తప్పు (మిస్టేక్) ఇదే..! మీరు గమనించారా.?

మహానటి..ఇప్పుడు జనాలందరికి మహానటి ఫీవర్ పట్టుకుంది..ఎవరినోట విన్నా సినిమా గురించి,సావిత్రి గారి గురించి చర్చే..ఎందుకు జరగదు..ఆమె ఏమన్నా మామూలు మనిషా..ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శిఖరం వంటి వ్యక్తి.తన గురించి  ఎంత చెప్పుకున్నా తక్కువే..అలాంటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తిని,దర్శకత్వం వహించిన నాగఅశ్విన్ ని ఎంత  మెచ్చుకున్నా తక్కువే.. ఇంతటి ప్రతిభ కలిగిన నాగ్ అశ్విన్ మహానటిలో ఒక చిన్న తప్పిదం చేశాడు.. అదేంటంటే…

సావిత్రి గారిది ఎంతో ఉదారస్వభావం..సాయం అంటూ ఎవరు తలుపు తట్టినా లేదనకుండా పంపేవారు కాదు..అలాంటి దాన గుణమే తనకి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది.ఆఖరుకి తినడానికి తిండి లేక,ఉండడానికి ఇల్లు లేకుండా చేసింది.సావిత్రి గారు చేసిన పొరపాటు వలన తన పిల్లలకు చివరికి ఏం మిగల్చకుండానే వెళ్లిపోయింది..అయితే అలా ఆస్తులు కోల్పోయి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు కూడా ఒప్పుకున్నది..అదే విషయాన్ని మహానటిలో కూడా ప్రస్తావించారు..అక్కడ ఒక సంధర్బంలో నాగ్ అశ్విన్ చిన్న తప్పు చేశాడు..

 సావిత్రి ఆస్తులు కోల్పోయి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు  పోషిస్తూ కాలం నెట్టుకొస్తున్నరోజుల్లో.. ఒకానొక సినిమా షూటింగ్ ముగించుకొని రిటర్న్ అవుతున్న సమయంలో ఆమెను పిలిచి మరీ భోజనం పెడతాడు గుమ్మడి వెంకటేశ్వర్రావు. కానీ.. “మహానటి” సినిమాలో సావిత్రికి అలా పిలిచి భోజనం పెట్టేది ఎస్వీ రంగారావు అన్నట్లుగా తెరకెక్కించాడు నాగఅశ్విన్. నిజానికి ఎస్వీఆర్ 1975లోనే చనిపోయారు. అలాంటిది 1980లో ఆయన బ్రతికున్నట్లుగా చూపించడం అనేది చారిత్రక తప్పిదం అనే చెప్పాలి….

సావిత్రి జీవితంలోని చీకటి కోణాల్ని, ఎవరికీ తెలియని చాలా విషయాల గురించి ఎంతో పరిశోధించిన నాగఅశ్విన్, అందరికీ తెలిసిన ఈ విషయంలో తప్పెలా చేశాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.తన పరిశోదనలో ఈ అంశాన్ని ఎందుకు మిస్ చేశారో…షూటింగ్ జరిగినప్పుడైనా ఎవరూ ప్రస్తావించలేదా..ప్రస్తావించినా కావాలనే ఇలా చూపారా..దీనిపై నాగ్ ఆశ్విన్ ఏం వివరణ ఇస్తారో..చూడాలి..

Comments

comments

Share this post

scroll to top