కూకట్పల్లిలో దారుణం: నడి రోడ్డుపై విద్యార్ధి హత్య.! ఇంటర్ పరీక్ష రాసి వస్తుండగా ముగ్గురు యువకులు కత్తితో.?

హైదరాబాద్ కూకట్ పల్లి ఉలిక్కి పడింది. మార్చి 12వ తేదీ సోమవారం ఉదయం జరిగిన హత్య కలకలం రేపింది. ముగ్గురు యువకులు.. వేటకొడవళ్లతో ఇంటర్ స్టూడెంట్ ను నరికి చంపారు. నడిరోడ్డపై.. పట్టపగలు హత్య జరగటంతో స్థానికులు వణికిపోయారు. సుదీర్ అనే యువకుడు ఇంటర్ పరీక్ష రాసేందుకు ఉదయమే ఎగ్జామ్ సెంటర్ కు వెళుతున్నాడు. కూకట్ పల్లి క్రాస్ రోడ్ దగ్గర హోండా షోరూం సమీపంలో జాతీయ రహదారిపైనే ముగ్గురు యువకులు సుదీర్ అడ్డగించారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో సుధీర్ ను కిరాతకంగా చంపేశారు. శరీరంపై విచక్షణారహితంగా పొడిచారు. స్పాట్ లోనే చనిపోయాడు ఆ యువకుడు.


హత్య చేసిన ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుధీర్ తండ్రితో జరిగిన గొడవ కారణంగానే ఈ మర్డర్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తేగానీ హత్యకు కారణాలను పూర్తిగా వెల్లడించలేం అంటున్నారు పోలీసులు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top