రాయలసీమ జిల్లా అంటే ఫ్యాక్షనిజం కు ఫేమస్. ఇది ఒకప్పటి పరిస్థితి అనుకునేవాళ్లం ఇన్ని రోజులు. కానీ ఇటీవల జరిగిన ఓ సంఘటన చూస్తే ఇప్పటికి ఇంకా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతున్నాయని నమ్మాల్సి వస్తుంది. డపజిల్లా ప్రొద్దుటూరు కోర్టు సమీపంలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిని ప్రత్యర్థులు పట్టపగలు కత్తులతో వెంటపడ్డారు. పాతకక్షలే దీనికి కారణం అంట. గురువారం ఉదయం మారుతి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిని అతికిరాతకంగా మచ్చుకత్తితో నరికి చంపారు. ప్రాణభయంతో పారిపోతున్నా వదిలిపెట్టకుండా విచక్షణారహితంగా నరికి చంపారు. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. కానీ వారు నిలబడి చూడటం తప్ప ఎదిరించే ధైర్యం చేయలేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడి వచ్చారు!
పోలీసుల కథనం ప్రకారం మృతుడు జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందినవాడని తెలిసింది. అతని పేరు బోరెడ్డి మారుతీరెడ్డి(32). పాతకక్షల క్రమంలోలో ప్రత్యర్థులు హత్య చేశారు. కోర్టుకు హాజరు అయ్యేందుకు అతను వెళుతుండగా గురువారం రోజు అతన్ని కోర్టు ఎదురుగ మాటువేసి హత్య చేసారు. నలుగురు వ్యక్తులు వెంటబడి కత్తితో నరికి నరికి చంపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీడియో మీరే చూడండి!