“డాక్టర్” దగ్గరకు వెళ్ళగానే “నాలుకను” చూపించమంటారు..! నాలుక చూసి డాక్టర్లు ఏం తెలుసుకుంటారు..?

 హెల్త్ బాగొక హాస్పటల్ కి వెళ్లినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని,నాలుక బైటికి తీయమని చెప్తుంటారు.కొద్దిసేపు పరిశీలిస్తారు.కానీ జ్వరం,తలనొప్పి,విరేచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్లినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌటొచ్చిందా ..నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంభందించిన కొన్ని విషయాలు తెలుస్తాయి..వాటిల్లో కొన్ని.
  • నాలుకపై తెల్ల మచ్చలు,నల్లమచ్చలుండడాన్ని ఎప్పుడైనా గమనించారా..ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్..ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు ఏర్పడతాయి.
  • నాలుక ఎర్రబారి మెరవడం, అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.. ఇవన్నీ ఐరన్‌ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు.
  • కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగతాగడం వల్ల లేదంటే  శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల వచ్చే ఫంగస్‌ కారణమై ఉంటుంది.
  • నాలుక వాపు అనేది ఒక లక్షణం. నాలుక వాచినప్పుడు తినడానికి,మాట్లాడానికి  ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం.
  • నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల కూడా కావచ్చు.
  •  నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు.
  • నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్‌ గ్రంధి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ సమస్య వల్ల గానీ కావచ్చు.

ఇప్పుడర్ధమయిందా డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఎందుకు నాలుకను పరీక్షిస్తారో.

Comments

comments

Share this post

scroll to top