రాజశేఖర్ కార్ ఆక్సిడెంట్ కు సంభందించి బయటపడ్డ మరో కోణం..! నిద్రమాత్రలు మింగి ఆ టైం లో ఎందుకొచ్చారో తెలుసా.?

ప్రముఖ హీరో రాజశేఖర్‌ అర్ధరాత్రి కారుతో రోడ్డుపై ఎందుకు వచ్చారు? ఆయన కారు ప్రమాదానికి గురవడం వెనుక కారణం ఏమిటి? మద్యం గానీ సేవించారా? అయితే.. కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు నెలకొన్న గొడవలతో మనస్తాపం చెందడం.. ఆ క్రమంలో ఆయన నిద్రమాత్రలు తీసుకోవడమే కారణమని తెలిసింది! రాజశేఖర్‌ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి శివరాంపల్లి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 240 పిల్లర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఓవర్‌టేక్‌ చేసేయత్నంలో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

‘‘చనిపోయిన తల్లి మళ్లీ రాదు.. ఇలా ఎన్ని రోజులు డల్‌గా ఉంటావు’’ అంటూ కుటుంబ సభ్యులు ఆయను ప్రశ్నించారు. మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రాజశేఖర్‌ కారు (ఏపీ 13ఈ1234 నంబరు)తో బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్‌ నుంచి మెహిదీపట్నంవైపు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పైనుంచి వస్తున్నారు.

శివరాంపల్లి పిల్లర్‌ నంబరు 240 వద్ద కారు ఆపి సిగరెట్‌ తాగారు. అనంతరం కారును తీశారు. తన కారును ఓవర్‌టేక్‌ చేయబోతున్న అత్తాపూర్‌ నివాసి రాంరెడ్డి కారును ఢీకొట్టారు. రాంరెడ్డి ఆ కారును ఆపి ప్రశ్నించారు. అప్పటికే మత్తులో ఉన్న రాజశేఖర్‌ పొంతనలేని సమాధానాలు చెప్పారు. రాంరెడ్డి వెంటనే డయల్‌ 100కి ఫోన్‌ చేసి, రాజేంద్రనగర్‌ ఠాణాలోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజశేఖర్‌, రాంరెడ్డికి డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. రాజశేఖర్‌కు బ్లడ్‌ ఆల్కహల్‌ కంటెంట్‌ 20 ఎంఎల్‌ చూపించింది. విషయం తెలిసిన రాజశేఖర్‌ భార్య జీవిత పీఎస్‌కు వచ్చారు. డిప్రెషన్‌లో ఉండటం వల్లే రాజశేఖర్‌ అలా చేశారని రాంరెడ్డికి చెప్పారు. దీంతో ఇరువురూ రాజీకి రావడంతో రాజశేఖర్‌ను పోలీసులు వదిలేశారు.

Comments

comments

Share this post

scroll to top