ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ఈ ఆల‌యంలో రాత్రి పూట ఎవ‌రూ ఉండ‌రాద‌ట‌. అలా ఉంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మన దేశంలో ఉన్న అనేక చారిత్రాత్మ‌క హిందూ ఆల‌యాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేక‌త ఉంటుంద‌న్న విష‌యం విదిత‌మే. కొన్నింట్లోనైతే సాక్షాత్తూ దేవుళ్లు, దేవ‌త‌లు తిరుగుతార‌ని, వారికి ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు ఆయా ఆల‌యాల‌కు వ‌స్తార‌ని కూడా ప్ర‌చారంలో ఉంది. అలాంటి ఆల‌యాలు కూడా మ‌న దేశంలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ ఆల‌యం కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. అక్క‌డ కొలువై ఉన్న శ్రీ‌కృష్ణుడు రాత్రి పూట ఆ ఆల‌యంలోకి వ‌స్తాడ‌ట‌. రాత్రి పూట అక్క‌డ ఎవ‌రూ ఉండ‌ర‌ట‌. ఇంకా ఇలాంటివే ఎన్నో విశేషాలు ఆ ఆల‌యంలో ఉన్నాయి. ఇంత‌కీ ఆ ఆల‌యం ఎక్క‌డో ఉందో తెలుసా..?

ఉత్త‌రప్ర‌దేశ్ లోని వృందావ‌న్‌లో పైన చెప్పిన ఆ ఆల‌యం ఉంది. దాని పేరు నిధి వ‌న్‌. అక్క‌డ కొలువై ఉన్న‌ది శ్రీ‌కృష్ణుడు. ఆ ఆల‌యంలో రాత్రి అవుతుందంటే చాలు, మ‌నుషులు కాదు క‌దా కనీసం ప‌క్షులు, జంతువులు కూడా ఉండ‌వు. సాధారణంగా ఆ ఆల‌యంలో ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. అంతేకాదు ఆల‌య ప్రాంగణంలో కోతులు కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి. అనేక ర‌కాల ప‌క్షులు కూడా అక్క‌డికి వ‌స్తాయి. అయితే రాత్ర‌యితే ఎవ‌రూ అక్క‌డ ఉండ‌రు. ఎందుకంటే రాత్రి స‌మ‌యంలో ఆ ఆల‌యానికి శ్రీకృష్ణుడు వ‌చ్చి రాధ‌, గోపిక‌ల‌తో నృత్యం చేస్తాడ‌ట‌. అందుక‌నే అక్క‌డ ఎవ‌రూ ఉండ‌ర‌ట‌. అలా ఉంటే వారు చ‌నిపోవ‌డ‌మో లేదంటే అంధులు, పిచ్చి వారు కావ‌డ‌మో జ‌రుగుతుంద‌ట‌.

నిధి వ‌న్ ఆల‌యంలో ఉన్న ఇంకా ఇతర విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

  • స్వామి హ‌రిదాస్ అనే ఓ గొప్ప భ‌క్తుడు, స‌న్యాసి ఒక‌ప్ప‌డు ఈ ఆల‌యంలో ఉన్నాడ‌ట‌. అప్పుడు అత‌ని భ‌క్తికి మెచ్చి కృష్ణుడు అతనికి సాక్షాత్క‌రించాడ‌ట‌. అలా కృష్ణుడు అత‌నికి క‌నిపించిన ప్ర‌దేశంలో ఒక ఆల‌యం కూడా వెల‌సింద‌ట‌. దాన్ని రంగ్ మ‌హ‌ల్ అని పిలుస్తారు.
  • రంగ్ మ‌హ‌ల్‌లో త‌మ‌ల‌పాకులు, ఒక గ్లాస్ నిండా నీటిని ఉంచుతారు. తెల్లారేసరికి ఆ త‌మ‌ల‌పాకులు ఉండ‌వ‌ట‌. ఆ గ్లాస్‌లో కూడా నీరు ఉండ‌ద‌ట‌.
  • ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న తుల‌సి మొక్క‌లు రాత్రి పూట గోపిక‌లుగా మారుతాయట‌. ఆ తుల‌సి మొక్క‌లు అన్నీ విడి విడిగా కాకుండా క‌లిసే ఉంటాయ‌ట‌. అయిన‌ప్ప‌టికీ వాటి కాండాలు దూరంగా ఉంటాయి. అవి భ‌క్తుల కోస‌మే అలా ఏర్ప‌డుతాయ‌ట‌.
  • ఆల‌య ప్రాంగ‌ణంలో పెద్ద గుండం ఉంటుంది. అది ఎలా ఏర్ప‌డిందంటే… ఒక‌ప్పుడు రాధ‌కు దాహం వేయడంతో నీటి కోసం కృష్ణుడే స్వ‌యంగా దాన్ని నిర్మించాడ‌ట‌.
  • సాధార‌ణంగా ఏ చెట్టు కొమ్మ‌లు అయినా పై దిశ‌గా పెరుగుతాయి. కానీ ఈ ఆల‌యంలో ఉన్న చెట్ల కొమ్మ‌లు అలా కాదు. అవి కింద‌కు వ‌స్తుంటాయి.
  • శ్రీ‌కృష్ణుడు ఎంత సేపూ పిల్ల‌న‌గ్రోవి ఊదుతూ గోపిక‌ల చుట్టూ తిరుగుతూ ఉండే స‌రికి ఓ సారి రాధ‌కు కోపం వ‌స్తుంది. దీంతో ఆమె కృష్ణుడి పిల్ల‌న‌గ్రోవిని తీసి దాస్తుంది. అలా అయినా కృష్ణుడు త‌న‌తో కొంత సేపు ఏకాంతంగా గ‌డుపుతాడ‌ని ఆమె న‌మ్మ‌కం. ఈ క్ర‌మంలోనే ఆమె పిల్ల‌న గ్రోవిని దాచిన స్థ‌లం కూడా నిధి వ‌న్‌లో ఉంద‌ని చెబుతారు.
  • నిధి వ‌న్ ఆల‌య ప్ర‌ధాన ద్వారం ముందు ఆల‌యానికి సంబంధించిన కొన్ని సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తూ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తాయి. వాటిలో రాత్రి అయ్యాక ఆల‌యంలో ఉండ‌కూడ‌ద‌నే నియ‌మం కూడా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top