పెళ్లిలో మటన్ గొడవ… ఎనిమిది మందికి గాయాలు.. వైరల్ అయిన వీడియో !!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఉప్పుపాకలో వివాహ వేడుకలో జరిగిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. భోజనాల కోసం జరిగిన గొడవ పరస్పర దాడులకు దారి తీసింది. వధువు, వరుడు తరపు బంధువులు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉప్పలపాకకు చెందిన అజ్మీరా కుమారికి కొత్తగూడెనికి చెందిన లావుడ్యా ప్రవీణ్ కుమార్ తో శుక్రవారం ఉప్పలపాకలోని వధువు ఇంటి వద్ద వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం భోజనాల వద్ద వరుడి తరపు బంధువులు మటన్ తో భోజనం వడ్డించాలని వధువు తరపు బంధువులతో గొడవకు దిగారు.

మటన్ పెట్టే ఆర్ధిక స్తోమత లేదని చికెన్ తో భోజనాలు చేయాలని వధువు తరపు బంధువులు నచ్చ జెప్పే ప్రయత్నం చేసారు. కానీ వరుడి తరపు బంధువులు ససేమిరా అనడంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి గొడవ ఎక్కువైంది.
భోజనాలు కోసం వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. సుమారు వంద కుర్చీలు విరిగిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొంత మందికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top