హిందూ ఖైదీలను విడిపించిన ముస్లింలు.! విడుదల అనంతరం ఒకరిని ఒకరు హత్తుకున్న హిందూ ముస్లీంలు.

కులం, మత,వర్గ విభేదాల కన్నా మానవత్వమే మిన్న అని చాటారు  ఉత్తరప్రదేశ్ పౌరులు. టికెట్ లేకుండా రైలు ప్రయాణాలు చేయడంలాంటి  చిన్న చిన్న కారణాలతో గత కొన్ని నెలలుగా జైల్లో మగ్గుతున్న15మంది  ఖైదీల విడుదల కోసం విరాళలు సేకరించి, జరిమానా చెల్లించి మరీ విడిపించారు  ముస్లీం యువకులు. ఖురేషి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ముస్లీం యువకులంతా ఓ గ్రూప్ గా ఏర్పడి   50 వేల రూపాయల వరకు సేకరించి  మొత్తం 15 మంది ఖైదీలను జిల్లా జైలు నుంచి విముక్తి కల్పించారు.

27-1448609590-27-1448607655-muslims

కొంతమంది తమకు విధించిన పూర్తి శిక్షాకాలాన్ని ముగించుకున్నప్పటికీ జరిమానా కట్టని కారణంగా ఇంకా జైల్లోనే ఉండిపోయారని తెలినారు పోలీస్ ఆఫీసర్ బీఆర్ మౌర్య. కాగా, ఇతరులకు సహాయం చేస్తే అల్లా ఆశీర్వదించి అందరికీ మంచి చేస్తాడని ఖైదీలను విడిపించామని ముస్లింలు  యువకులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన హిందువులు తమను విడిపించిన ముస్లిం సోదరులను హత్తుకుని  కృతజ్ఞలు తెలిపారు.

Comments

comments

Share this post

scroll to top